అక్షరటుడే, ఇందూరు: CP Sai Chaitanya | నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ (Nizamabad Police Commissionerate ) పరిధిలో లైసెన్స్డ్ ఆయుధాలు (Licensed weapons) కలిగిన వారు వెంటనే వాటిని ఆయా పోలీస్స్టేషన్లలో అప్పజెప్పాలని సీపీ సాయిచైతన్య సూచించారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు.
CP Sai Chaitanya | స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో..
స్థానిక సంస్థల ఎన్నికల (local Body Elections) షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో ఎవరూ కూడా లైసెన్స్డ్ ఆయుధాలను కలిగి ఉండవద్దని ఆయన సూచించారు. ఎన్నికల నియమ నిబంధనలను ప్రతిఒక్కరూ తూచా తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు.
CP Sai Chaitanya | ఈనెల 9వ తేదీలోపు..
ఆయుధాలను ఈనెల 9వ తేదీలోపు సంబంధిత పోలీస్టేషన్లలో అందజేయాలని సీపీ సూచించారు. ఎవరైనా ఆయుధాలను అప్పగించికపోతే ఆర్మ్స్ యాక్ట్ (Arms Act) ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా ఉత్తర్వుల నుంచి మినహాయింపు కావాలని భావిస్తే.. పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని సంబంధిత అధికారికి రాతపూర్వకంగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.