అక్షరటుడే, వెబ్‌డెస్క్ : LIC | ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (Life Insurance Corporation of India) ఇటీవల రెండు కొత్త పాలసీలను (New plans) లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇందులో ఒకటి మహిళలకు మాత్రమే ఉద్దేశించింది.
అందరికోసం జన సురక్ష (ప్లాన్ 880)ను ప్రవేశపెట్టిన ఎల్‌ఐసీ.. మహిళల కోసం బీమా లక్ష్మిని (Bima Lakshmi) (ప్లాన్ 881) తీసుకువచ్చింది. విభిన్న వ్యక్తిగత అవసరాలను తీర్చడానికి, ఆర్థిక రక్షణ, పొదుపు ప్రయోజనాలను అందించడానికి వీటిని తీసుకువచ్చినట్లు సంస్థ తెలిపింది. కొత్త నెక్స్ట్ జెన్ జీఎస్టీ విధానంలో ఎల్‌ఐసీ విడుదల చేసిన మొదటి ఉత్పత్తులు ఇవేనని ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ పాలసీల వివరాలు తెలుసుకుందామా..
LIC | ఎల్‌ఐసీ బీమా లక్ష్మి..
మహిళలకోసం ఉద్దేశించిన ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ ఎల్‌ఐసీ బీమా లక్ష్మి (LIC’s Bima Lakshmi). ఇది జీవిత బీమాతోపాటు పొదుపు పథకం. ఇది నాన్ పార్టిసిపేటింగ్(non participating), నాన్‌లింక్డ్ మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్ ఇది. అంటే ఇది మార్కెట్ లేదా బోనస్‌లతో అనుసంధానమై ఉండదు. జీవిత బీమా, కాలానుగుణ మనీబ్యాక్ ఎంపికలు రెండిరటినీ అందిస్తుంది.
- పాలసీ వ్యవధి : 25 ఏళ్లు.
- ప్రీమియం చెల్లింపు కాలం : ఏడు నుంచి 15 ఏళ్ల వరకు చెల్లింపుల వ్యవధిని ఎంచుకోవచ్చు.
- అర్హత వయసు : పాలసీ తీసుకోవడానికి కనీస వయసు 18 ఏళ్లు.. గరిష్ట వయసు 50 ఏళ్లు.
- బీమా మొత్తం : కనీసం రూ. 2 లక్షలు. గరిష్ట పరిమితి లేదు. యాక్సిడెంటల్ డెత్(Accidental death) మరియు డిజేబిలిటీ రైడర్, న్యూ టర్మ్ అష్యూరెన్స్ రైడర్, ఫిమేల్ క్రిటికల్ ఇల్‌నెస్ రైడర్ వంటి రైడర్లను జోడిరచవచ్చు.
- ఆప్షన్లు : హామీ మొత్తాన్ని పొందడానికి మూడు రకాల ఆప్షన్లున్నాయి. పాలసీ తీసుకునే సమయంలోనే వీటిని ఎంచుకోవాలి.
- ఏటా 7 శాతం చొప్పున ప్రీమియం చెల్లింపుపై గ్యారంటీడ్ అడిషన్ జమ అవుతుంది. పాలసీ మెచ్యూరిటీ సమయంలో బీమా హామీ మొత్తంతోపాటు గ్యారంటీడ్ అడిషన్‌ను చెల్లిస్తారు.
- పాలసీ కాలంలో పాలసీదారుకు ఏదైనా జరిగితే వార్షిక ప్రీమియం(Annual premium)పై పదిరెట్లు లేదా బీమా హామీ మొత్తంలో ఏది ఎక్కువైతే దానిని చెల్లిస్తారు.
- ప్రీమియం వ్యవధి : నెల, మూడు నెలలు, ఆరునెలలు, వార్షిక పద్ధతులలో ప్రీమియం చెల్లించవచ్చు.
LIC | అందరికోసం జన్ సురక్ష..
ఎల్‌ఐసీ జన్ సురక్ష ప్లాన్ (LIC’s Jan Suraksha) ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం రూపొందించిన బీమా పథకం. అందరికీ బీమా రక్షణ కల్పించాలన్న ఉద్దేశంతో తక్కువ ధరలో తీసుకువచ్చారు. ఇది కూడా నాన్ పార్టిసిపేటింగ్, నాన్ లింక్డ్ స్కీం. తక్కువ ప్రీమియం(Low premium) దీని ప్రత్యేకత.
- వయసు : 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయసువారు అర్హులు.
- బీమా మొత్తం : కనీస బీమా మొత్తం లక్ష రూపాయలు. గరిష్టంగా రూ.2 లక్షలు ఎంచుకోవచ్చు.
- పాలసీ వ్యవధి : 12 ఏళ్లనుంచి 20 ఏళ్లు.
- ప్రీమియం చెల్లింపు కాలం: మొత్తం పాలసీ కాలం(Policy term)లో ఐదేళ్లు తీసివేయగా వచ్చే కాలం. అంటే 20 ఏళ్ల వ్యవధి ఎంచుకుంటే 15 ఏళ్లపాటు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
నెల, మూడు నెలలు, ఆరు నెలలు, వార్షిక కాల వ్యవధులలో ప్రీమియం చెల్లించవచ్చు. వార్షిక ప్రీమియంపై 4 శాతం చొప్పున గ్యారంటీడ్ అడిషన్స్(Guaranteed additions) లభిస్తాయి.
మెచ్యూరిటీ సమయంలో హామీ మొత్తంతోపాటు గ్యారంటీడ్ అడిషన్‌ను కూడా చెల్లిస్తారు. పాలసీ కాల వ్యవధిలో పాలసీదారుకు ఏదైనా జరిగినా హామీ మొత్తాన్ని ఇస్తారు. డేళ్లపాటు ప్రీమియం చెల్లించిన తర్వాత ఆటో కవర్ ఉంటుంది. ఈ పాలసీపై రుణ సదుపాయం కూడా పొందవచ్చు.