అక్షరటుడే, ఇందూరు: LIC Nizamabad | జిల్లా కేంద్రంలోని ఎల్ఐసీ బ్రాంచ్‌లలో (LIC Branch)మేనేజర్లు గురువారం బాధ్యతలు స్వీకరించారు. నిజామాబాద్ మెయిన్ బ్రాంచ్ మేనేజర్‌గా రామారావు, కంఠేశ్వర్ బ్రాంచ్ మేనేజర్‌గా సక్రు గురువారం బాధ్యతలు తీసుకున్నారు. వీరికి ఏజెంట్ల సంఘం(LIC Agents Association) అధ్యక్షుడు మందుల దినేష్ ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. కార్యక్రమంలో సంఘం కార్యదర్శి లింగన్న, కోశాధికారి సుధాకర్, శ్రీనివాస్ రెడ్డి, చిరంజీవి, నవోదయ తదితరులు పాల్గొన్నారు.