అక్షరటుడే, వెబ్డెస్క్: LIC | లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) (Life Insurance Corporation of India) అరుదైన ఘనత సాధించింది. గిన్నిస్ వరల్డ్ రికార్డును (Guinness World Record) సొంతం చేసుకుంది. 24 గంటల్లో అత్యధిక పాలసీలు విక్రయించిన ఘనత సాధించామని ఎల్ఐసీ తెలిపింది. జనవరి 20న భారతదేశం అంతటా మొత్తం 4,52,839 మంది LIC ఏజెంట్లు.. 5,88,107 జీవిత బీమా పాలసీలను విజయవంతంగా పూర్తి చేసి జారీ చేశారని పేర్కొంది.
LIC | ఇది చారిత్రాత్మక విజయం
24 గంటల్లో అత్యధిక జీవిత బీమా పాలసీలు విక్రయించడంతో గిన్నిస్ వరల్డ్ రికార్డును (Guinness World Record) సాధించినట్లు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (Life Insurance Corporation of India) శనివారం తెలిపింది. ఇది చారిత్రాత్మక విజయం అని పేర్కొంది. ఏజెన్సీ నెట్‌వర్క్ (agency network) అసాధారణ పనితీరును ఈ విజయం తెలియజేస్తోందని చెప్పింది. “ఇది మా ఏజెంట్ల అంకితభావం, నైపుణ్యానికి నిదర్శనం. ఈ విజయం మా కస్టమర్లకు, వారి కుటుంబాలకు కీలకమైన ఆర్థిక రక్షణను అందించాలనే మా లక్ష్యంపై మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది” అని ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా.. ఎల్ఐసీ ఎండీ, సీఈవో సిద్ధార్థ మొహంతి సూచన మేరకు జనవరి 20న ‘మ్యాడ్ మిలియన్ డే’ పేరిట ఈ ఘనత సాధించినట్లు పేర్కొంది.