HomeతెలంగాణUnion Minister Bandi Sanjay | ‘నాన్నకు లేఖ’.. కాంగ్రెస్‌ వదిలిన బాణం: కేంద్ర మంత్రి...

Union Minister Bandi Sanjay | ‘నాన్నకు లేఖ’.. కాంగ్రెస్‌ వదిలిన బాణం: కేంద్ర మంత్రి బండి సంజయ్‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Union Minister Bandi Sanjay | ఎమ్మెల్సీ కవిత కేసీఆర్​ (KCR)కు రాసిన లేఖ రాయడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. గులాబీ పార్టీలో లుకలుకలు మొదలయ్యాయనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఈ అంశం హాట్​ టాపిక్​గా మారింది. కాగా.. ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) లేఖపై కేంద్ర మంత్రి బండి సంజయ్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నాన్నకు లేఖ’ వ్యవహరంలో కవిత కాంగ్రెస్ వదిలిన బాణం అని అభివర్ణించారు. ఇది రాజకీయ డ్రామా అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ విఫలమయ్యాయని పేర్కొన్నారు. ఈ పార్టీలు కుటుంబ పాలనకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. లేఖ డ్రామాను తెలంగాణ ప్రజలు పట్టించుకోవట్లేదని పేర్కొన్నారు. బీఆర్​ఎస్​ పాలనలో అవినీతి రాజ్యమేలిందని.. ప్రస్తుత కాంగ్రెస్​ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేక అపసోపాలు పడుతోందని ఎద్దేవా చేశారు.

Union Minister Bandi Sanjay | కుటుంబ పాలనకు బీజేపీ వ్యతిరేకం..

కేంద్రంలోనైనా.. రాష్ట్రంలోనైనా కుటుంబపాలనకు బీజేపీ పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేశారు. నిజమైన మార్పును తీసుకొచ్చే పార్టీ కేవలం బీజేపీనేనని ఆయన పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అభివృద్ధితో పాటు పారదర్శక, అవినీతిరహిత పరిపాలన అందిస్తుందని హామీ ఇచ్చారు.