Homeజిల్లాలునిజామాబాద్​MLA Dhanpal | స్వదేశీ వస్తువులను ఉపయోగిద్దాం: ధన్​పాల్​

MLA Dhanpal | స్వదేశీ వస్తువులను ఉపయోగిద్దాం: ధన్​పాల్​

అక్షరటుడే, ఇందూరు: MLA Dhanpal | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్​కీ బాత్ కార్యక్రమాన్ని (Mann Ki Baat program) ఆదివారం సుభాష్ నగర్​లో గల క్యాంప్ కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా నాయకులతో కలిసి వీక్షించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రధాని మోదీ (PM Modi) జాతిని ఉద్దేశించి గొప్ప సందేశంతో పాటు ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారన్నారు. దేశ ప్రజలంతా స్వదేశీ వస్తువులను ఉపయోగిస్తూ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారన్నారు. కేంద్ర ప్రభుత్వం (central government) మేడిన్ ఇండియా, మేకింగ్ ఇండియా నినాదంతో దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహిస్తుందన్నారు. గ్రామీణ మహిళలు సైతం చిన్నచిన్న కుటీర పరిశ్రమలతో అభివృద్ధిని సాధిస్తున్నారని తెలిపారు.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (Rashtriya Swayamsevak Sangh) ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంఘ్ సేవలను గుర్తుచేయడం జరిగిందని పేర్కొన్నారు. అయోధ్య రామ మందిరం నిర్మాణంతో హిందువుల చిరకాల స్వప్నం నెరవేరిందని గుర్తు చేశారన్నారు. దేవీ నవరాత్రులు, దీపావళి కానుకగా దేశ ప్రజలకు గొప్ప బహుమతిగా జీఎస్టీ తగ్గింపులు చేశారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.లక్ష్మీనారాయణ, జిల్లా కార్యదర్శి జ్యోతి, మండల అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్​ఛార్జీలు పాల్గొన్నారు.

Must Read
Related News