అక్షరటుడే, ఇందూరు: Yedla polala Amavasya | రైతులను ఆదరించాలని.. వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ కమిషన్ (State Agricultural Commission) సభ్యుడు గడుగు గంగాధర్ (Gadugu Gangadhar) పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వ మున్నూరు కాపు ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఎడ్ల పొలాల అమావాస్య పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గడుగు గంగాధర్ మాట్లాడుతూ.. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని స్పష్టం చేశారు. వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. యువ రైతులు ముందుకు వచ్చి ఆర్గానిక్ వ్యవసాయం చేసి మిగిలిన రైతులను ఆదర్శంగా నిలువాలని కోరారు.
Yedla polala Amavasya | మున్నూరుకాపులే వ్యవసాయంలో ముందున్నారు..
వ్యవసాయంలో మున్నూరు కాపులు ముందుండి జిల్లాలో అగ్రగామిగా నిలుస్తున్నారని గడుగు గంగాధర్ స్పష్టం చేశారు. ఈ పరంపరను ఇలాగే కొనసాగించే బాధ్యత రైతుల కుటుంబీకులపైనే ఉందని వెల్లడించారు. వ్యవసాయాన్ని వీడకుండా ఆదరించి రైతే రాజుగా నిలవాలని పేర్కొన్నారు. నేను దివంగత డీఎస్ గురువు ఆధ్వర్యంలో రాజకీయాల్లోకి వచ్చానని.. మున్నూరుకాపులు రాజకీయాల్లో నన్ను ఆదరించారని గుర్తు చేసుకున్నారు. నాలుగు దశాబ్దాలుగా మున్నూరుకాపులతో తనకు బంధం ఉందని వివరించారు.
Yedla polala Amavasya | మున్నూరుకాపులకు అండగా ఉందటా..
మున్నూరు కాపులకు ఏ సహకారం కావాలన్న వ్యవసాయ కమిషన్ సభ్యుడిగా అన్నివిధాలుగా అండగా ఉంటానని స్పష్టం చేశారు. రైతులను వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తానని వెల్లడించారు. కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం (Munnuru kapu sangham) కోశాధికారి ధర్మపురి సురేందర్(Dharmapuri surendhar) పటేల్ అతిథిగా హాజరై మున్నూరుకాపుల విశిష్టతను వివరించారు.
ఈ సందర్భంగా జిల్లాలోని పదిమంది యువరైతులను ఉత్తమ రైతులుగా ఎంపిక చేసి సన్మానించడం జరిగింది. సభకు జిల్లా మున్నూరు కాపు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు తోట రాజశేఖర్ (Thota rajashekar) అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి డాక్టర్ అబ్బాపూర్ రవీందర్ పటేల్, గౌరవ అధ్యక్షుడు బుస్సా ఆంజనేయులు పటేల్, ముఖ్య సలహాదారు ఆకుల ప్రసాద్ పటేల్, ఉపాధ్యక్షులు రెంజర్ల నరేష్ పటేల్, హరిచరణ్ పటేల్, కోశాధికారి బాసెట్టి సురేష్ కుమార్ పటేల్, నిర్వహణ కార్యదర్శి డాక్టర్ సర్వే సత్యనారాయణ పటేల్, సలహాదారులు అబ్బాయిల లింబాద్రి పటేల్, నారాయణరెడ్డి పటేల్, తదితరులు పాల్గొన్నారు.
Yedla polala Amavasya | ఉత్తమ రైతులు వీరే..
కోరడి కిరణ్(గాజుల్పేట్), పంచరెడ్డి శ్రవణ్(దుబ్బా), సీహెచ్ రాజేందర్(మంగళ్పాడ్), వరి రాజేందర్(ఏఆర్పీ క్యాంప్), గజుమల అశోక్(మోర్తాడ్), ముత్యలా లింబాద్రి(పాటిగల్లీ), చిట్టి పండరి(బోర్గాం), మస్తా గంగాముత్యం(న్యాల్కల్), క్యాతమ్ గంగాధర్(ముబాకర్నగర్), బుద్దాయి లింగారెడ్డి(శివాజీనగర్) ఉన్నారు.