అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Raghunandan Rao | దమ్ముంటే కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. తాము కూడా రాజీనామా చేస్తామని ఎన్నికలకు వెళ్దామని ఆయన పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ (PCC Chief Mahesh Goud)కు సవాల్ విసిరారు.
రాష్ట్రంలో ఓటు చోరీ (Vote Chori) జరిగిందని, అందుకే బీజేపీ ఎంపీలు గెలిచారని ఇటీవల మహేశ్‌గౌడ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై రఘునందన్‌రావు మంగళవారం స్పందించారు. వంద సీట్లు గెలుస్తామని పీసీసీ చీఫ్ అంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు నమ్మకం ఉంటే శాసనసభ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లే దైర్యం ఉందా అని ఆయన సవాల్ చేశారు.
Raghunandan Rao | బాధ్యత మరిచి..
పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ బాధ్యత మరిచి ఏది పడితే అది మాట్లాడుతున్నారని రఘునందన్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరం రాజీనామా చేసి కొత్త ఓటర్ లిస్ట్‌తో మళ్లీ ఎన్నికలకు వెళ్దామన్నారు. దమ్ముంటే కాంగ్రెస్ ఎంపీలతో రాజీనామా చేయించాలన్నారు. ఓటు చోరీ చేస్తే 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఎలా గెలిచారని ప్రశ్నించారు.
Raghunandan Rao | బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి
బీసీ రిజర్వేషన్ల (BC Reservations) విషయంలో కాంగ్రెస్ కుంటి సాకులు చెబుతోందన్నారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాళేశ్వరం నివేదిక (Kaleshwaram Report)ను ప్రజలు ముందు ఉంచాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుతోనే యూరియా కొరత నెలకొందని రఘునందన్‌రావు ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో యూరియా సరిపడా ఉంటే.. మన దగ్గర మాత్రమే ఎందుకు కొరత ఏర్పడిందని ప్రశ్నించారు. కాగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.