అక్షరటుడే, ఎల్లారెడ్డి: Municipal Elections | ఎల్లారెడ్డి మున్సిపాలిటీపై (Yellareddy Municipality) బీజేపీ జెండా ఎగరేద్దామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నీల చిన్నరాజులు పేర్కొన్నారు. పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో పట్టణ బీజేపీ అధ్యక్షుడు రాజేష్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహాక సమావేశం నిర్వహించారు.
Municipal Elections | బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవాలి
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో (municipal elections) భాగంగా పట్టణంలోని 12 వార్డుల్లో కచ్చితంగా బీజేపీ అభ్యర్థులను గెలిపించి మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలని ఆయన పేర్కొన్నారు. బలమైన అభ్యర్థులను మాత్రమే బరిలో ఉంచాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌ఛార్జి విక్రమ్‌రెడ్డి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా జనరల్ సెక్రెటరీ రవీందర్ రావు, రాష్ట్ర నాయకులు మర్రి బాలకిషన్, జిల్లా ఉపాధ్యక్షుడు బత్తిని దేవేందర్, జిల్లా నాయకులు గంగారెడ్డి, పట్టణ అధ్యక్షుడు అగల్ దివిటి రాజేష్, మండల అధ్యక్షుడు పెద్దడ్ల నర్సింలు, కాశీనాథ్, లక్ష్మీ నారాయణ, సుజాత, సత్యం, రమేష్, రాములు, నక్క గంగాధర్, బాలరాజ్, మామిడి రమేష్, మర్రి బాలయ్య, గజానంద్, అల్లం పండరి, హరినాథ్, రాంప్రసాద్, దశరథ్, శివకుమార్, గణేష్, శివ పాల్గొన్నారు.