అక్షరటుడే, వెబ్‌డెస్క్: PM Narendra Modi | జర్మనీ ఛాన్స్‌లర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఫ్రెడరిక్ మెర్జ్‌ను (Friedrich Merz) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) మంగళవారం అభినందించారు. ఈ మేరకు ఆయనకు ఫోన్ చేసిన మోదీ ప్రత్యేక అభినందనలకు తెలిపారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య ప్రపంచ పరిణామాలపై చర్చ జరిగింది. ఉగ్రవాదంపై కలిసి పోరాటం చేద్దామని ఇరువురు పునరుద్ఘాటించారు. మెర్జ్‌తో చర్చలపై ప్రధాని మోదీ ‘X’లో ఒక పోస్ట్ పెట్టారు. ఉగ్రవాదంపై పోరాటంలో ఇండియా, జర్మనీ (india – germany) కలిసి ఉన్నాయని తెలిపారు. “ఛాన్స్లర్ FriedrichMerz తో మాట్లాడాను. పదవీ బాధ్యతలు స్వీకరించినందుకు ఆయనను అభినందించా. భారతదేశం, జర్మనీ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మా నిబద్ధతను ఇది పునరుద్ఘాటించింది. ప్రాంతీయ, ప్రపంచ పరిణామాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఉగ్రవాదంపై పోరాటంలో మేము ఐక్యంగా ఉన్నాము” అని ప్రధాని తెలిపారు.
PM Narendra Modi | పదో చాన్స్‌లర్‌గా మెర్జ్..
మే నెల ప్రారంభంలో జరిగిన ఎన్నికల్లో ఫ్రెడరిక్ మెర్జ్ (Friedrich Merz) ఎన్నికయ్యారు. మొదటి రౌండ్‌లో ఊహించని రీతిలో ఎదురుదెబ్బ తగిలినప్పటికీ, రెండో రౌండ్‌లో 630 ఓట్లకు గాను 325 ఓట్లు పొందిన మెర్జ్ స్పష్టమైన మెజారిటీని సాధించారు. రెండవ ప్రపంచ యుద్ధం (World War II) తర్వాత జర్మనీకి 10వ ఛాన్స్లర్ అయ్యారు. తాజాగా ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు.