అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Munnuru Kapu Sangham | ఐకమత్యంతో మున్నూరు కాపుల సత్తా చాటుదామని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ (Dharmapuri Sanjay) అన్నారు. మున్నూరు కాపు జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఇటీవల గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల సన్మాన మహోత్సవం, ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నగరంలోని (Nizamabad city) ప్రగతి నగర్ మున్నూరు కాపు సంఘంలో ఘనంగా నిర్వహించారు.
Munnuru Kapu Sangham | నగరంలో భారీ ర్యాలీ
శివాజీ నగర్ నుంచి ప్రగతి నగర్ మున్నూరు కాపు సంఘం వరకు ముందుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ప్రగతినగర్ మున్నూరుకాపు సంఘంకు చేరుకున్నా అనంతరం సర్పంచ్ (Sarpanches) ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మపురి సంజయ్ మాట్లాడుతూ.. మున్నూరు కాపులు రాజకీయంగా ఎదగాలని, ఏ కష్టం వచ్చినా జిల్లా కేంద్రంలో తానున్నానని మర్చిపోవద్దన్నారు. రాజకీయంగా ఎదుగుదలకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.
Munnuru Kapu Sangham | జిల్లాలో 450 పైచిలుకు ప్రజాప్రతినిధులు
జిల్లాలో మున్నూరుకాపు కులస్థులు 450 పైచిలుకు ప్రజాప్రతినిధులు సర్పంచ్, సర్పంచ్, వార్డు మెంబర్లుగా గెలవడం గొప్ప విషయమని, ఇంతమందిని ఒకే వేదికపై సన్మానించడం సంతోషంగా ఉందన్నారు. రాబోవు రోజుల్లో మున్నూరు కాపులతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నామన్నారు. సన్మాన కార్యక్రమ నిర్వహణలో ఎంతోమంది శ్రమ దాగిందని, వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ రోజు మీ అందరినీ ఇలా చూస్తుంటే తన తండ్రి ధర్మపురి శ్రీనివాస్ గుర్తొస్తున్నారన్నారు. ఆయన సంఘానికి ఎంతో సేవ చేశారని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ సంఘం అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు. ఐకమత్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలమని, గ్రామ మండల, స్థాయిలలో మున్నూరు కాపులు ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
Munnuru Kapu Sangham | చరిత్ర తిరగరాసే నాయకుడిగా ఎదగాలి
ఉర్దూ అకాడమి ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్ మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా చరిత్రను తిరగరాసే నాయకుడిగా సంజయ్ ఎదగాలని కోరుకుంటున్నామన్నారు. మున్నూరు కాపు సంఘానికి ధర్మపురి సంజయ్ రాకతో వైభవం సంతరించుకుందన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా సంఘ సేవ చేయడం గొప్ప విషయం అన్నారు. ఆనాడు ధర్మపురి శ్రీనివాస్ జిల్లాలో మున్నూరు కాపు సంఘంతో పాటు అన్ని సంఘాల బలోపేతం కోసం కృషి చేశారన్నారు.
Munnuru Kapu Sangham | అన్నం పెట్టే రైతులు.. మున్నూరుకాపులు
మున్నూరు కాపులు అంటేనే దేశానికి అన్నం పెట్టి రైతులని.. ఆ రైతులు ప్రజా ప్రతినిధులుగా గెలువడం సంతోషంగా ఉందని తాహెర్ బిన్ హందాన్ అన్నారు. ఆనాడు శీనన్నతో పనిచేశా.. నేడు ధర్మపురి సంజయ్‌తో పనిచేసే అవకాశం రావడం సంతోషకర విషయం అన్నారు. అనంతరం గెలుపొందిన 67మంది సర్పంచ్‌లు, 60మంది ఉప సర్పంచ్‌లు, 432 మంది వార్డ్ సభ్యులను శాలువా పూలమాలతో జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, ధర్మపురి సురేందర్, మాజీ మేయర్ ఆకుల సుజాత, రామర్తి గంగాధర్, ఆకుల చిన్న రాజేశ్వర్, బంటు బలరాం, ఆకుల శ్రీశైలం, తోట రాజశేఖర్, మిద్దె రవీందర్, దారం పోతన్న, అంగిరేకుల సాయిలు, వరాల రాజు, ఆంజనేయులు కాపు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
