More
    Homeజిల్లాలునిజామాబాద్​GST Reforms | ధర తగ్గాకే కొందాం!.. జీఎస్టీలో సంస్కరణలు తెచ్చిన కేంద్రం

    GST Reforms | ధర తగ్గాకే కొందాం!.. జీఎస్టీలో సంస్కరణలు తెచ్చిన కేంద్రం

    Published on

    అక్షరటుడే ఇందూరు : GST Reforms | కేంద్ర ప్రభుత్వం (central government) ఇటీవల జీఎస్టీలో సంస్కరణలు తెచ్చింది. ప్రస్తుతం ఉన్న స్లాబ్​ల సంఖ్య తగ్గించింది. దీంతో చాలా రకాల వస్తువుల ధరలు దిగి రానున్నాయి.

    ముఖ్యంగా కార్లు, బైక్​ల (cars and bikes) ధరలు భారీగా తగ్గనున్నాయి. దీంతో ప్రస్తుతం వాటి కొనుగోళ్లు నిలిచిపోయాయి. ధరలు తగ్గాకే కొనుగోలు చేద్దామనే భావనలో ప్రజలు ఉన్నారు. ఈనెల 22 నుంచి కొత్త స్లాబ్​లు అమలు చేస్తున్న తరుణంలో వాహనాలను కొనుగోలు చేయాలనుకునేవారు తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నారు.

    వస్తు సేవల పన్ను (Goods and Services Tax) మార్పుల నేపథ్యంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఊరట లభించనుంది. ముఖ్యంగా కార్లు, ద్విచక్ర వాహనాల ధరలు కొంత తగ్గనున్నాయి. వీటిపై 28 శాతం ఉన్న జీఎస్టీని 18 శాతానికి తగ్గించారు. దీంతో ద్విచక్ర వాహనాల రేట్లు రూ.8 వేల నుంచి రూ.20 వేల వరకు తగ్గే అవకాశం ఉంది. అదే కార్ల ధరలు రూ.60 వేల నుంచి రూ. 1.50 లక్షల వరకు తగ్గనుంది. దీంతో కొనుగోలుదారులు వాహనాల కోసం ముందస్తు బుకింగ్ చేసుకోవడం లేదు. ఫలితంగా కస్టమర్లు రాక షో రూమ్​లు వెలవెలబోతున్నాయి.

    GST Reforms | అందిరానున్న అవకాశం..

    GST Reforms | వ్యాపారాలకు బ్రేక్​

    ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కార్లు, ద్విచక్ర వాహనాల షోరూంలు 100 వరకు ఉంటాయి. అన్ని షోరూమ్లలో నెలకు సుమారు 800 నుంచి వేయి వరకు ద్విచక్ర వాహనాలు, 100 నుంచి 200 వరకు కార్లు విక్రయిస్తుంటారు. తగ్గనున్న వాహనాల ధరలను (vehicle prices) సద్వినియోగం చేసుకునేందుకు కొనుగోలుదారులు ఎదురుచూస్తున్నారు. ఫలితంగా రూ.కోట్లలో సాగే వ్యాపార కార్యకలాపాలకు కొద్దిరోజులు బ్రేక్ పడనుండగా వినియోగదారులకు మాత్రం ధర తగ్గింపుతో అవకాశం అందిరానుంది.

    GST Reforms | కలిసి రానున్న దసరా..

    సాధారణంగా చాలా మంది దసరా పండుగకు కొత్త వాహనాలు కొనుగోలు చేస్తుంటారు. ఈ సెంటిమెంట్ ఉన్నవారు కార్లు, ద్విచక్ర వాహనాలకు ముందస్తుగా బుకింగ్ చేసుకుని మరి దసరా రోజు తీసుకుంటారు. అయితే దసరా (Dussehra) నాటికి తగ్గించిన జీఎస్టీ అమలులోకి రానుండటంతో ఆయా వాహనాల ధరలు తగ్గనున్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కొనుగోలుదారులు చూస్తున్నారు.

    ధరలు తగ్గనుండటంతో కొనుగోళ్లు సైతం పెరగనున్నట్లు విక్రయ కేంద్రాల నిర్వాహకులు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో (central government announcement) ప్రస్తుతానికి వ్యాపార కార్యకలాపాలు స్తంభించినా.. దసరా నాటికి అమాంతం పెరిగే అవకాశం ఉంది. అయితే అప్పటికి అనుకున్న వాహనాలు సైతం సమయానికి అందుబాటులో ఉండకపోవచ్చు. దీన్ని ఆసరా చేసుకుంటున్న షోరూం నిర్వాహకులు ముందస్తుగా కొనుగోలు చేయాలనుకునే వారికి ఆఫర్లు ప్రకటిస్తున్నారు.

    GST Reforms | కార్లపై డిస్కౌంట్ అందజేస్తున్నాం

    – ప్రేమ్ కుమార్, కియా షో రూమ్

    ప్రస్తుతం ఎవరైనా కార్లు కొనుగోలు చేస్తే డిస్కౌంట్ అందజేస్తున్నాం. జీఎస్టీ తగ్గింపు నేపథ్యంలో కొంతవరకు విక్రయాలు తగ్గాయి. సెప్టెంబర్​ 22వ తేదీ తర్వాత కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉంది.

    More like this

    MLA Bhupathi Reddy | సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరికలు..

    అక్షరటుడే, డిచ్‌పల్లి : MLA Bhupathi Reddy | కాంగ్రెస్​ ప్రభుత్వం(Congress Government) అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై...

    Bheemgal | భీమ్‌గల్‌లో బీజేపీ కార్యశాల

    అక్షరటుడే, భీమ్‌గల్: Bheemgal | పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం కార్యశాల నిర్వహించారు. మండలాధ్యక్షుడు ఆరే రవీందర్‌ అధ్యక్షతన...

    Prajavani | స్థానికేతరులకు కల్లు డిపోలో సభ్యత్వం

    అక్షరటుడే, ఇందూరు : Prajavani | నిజామాబాద్ మూడో కల్లు డిపో(Kallu Depot)లో అర్హులైన కార్మికులకు అవకాశం కల్పించకుండా.....