ePaper
More
    HomeసినిమాSupreme Court | ఆ సినిమానైతే విడుద‌ల కానివ్వండి.. ‘ఉద‌య్‌పూర్ ఫైల్స్’పై విచార‌ణ‌కు సుప్రీం నిరాక‌ర‌ణ‌

    Supreme Court | ఆ సినిమానైతే విడుద‌ల కానివ్వండి.. ‘ఉద‌య్‌పూర్ ఫైల్స్’పై విచార‌ణ‌కు సుప్రీం నిరాక‌ర‌ణ‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Supreme Court | దర్జీ కన్హయ్య లాల్(Tailor Kanhaiya Lal) హత్య కేసు ఆధారంగా రూపొందిన “ఉదయపూర్ ఫైల్స్” సినిమా ప్రదర్శనను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై అత్యవసర విచారణను సుప్రీంకోర్టు(Supreme Court) బుధవారం తిరస్కరించింది. ముందు సినిమానైతే విడుద‌ల చేయ‌నివ్వండ‌ని జస్టిస్ సుధాంషు ధులియా(Justice Sudhanshu Dhulia), జోయ్‌మల్య బాగ్చి(Joy Mallya Bagchi)లతో కూడిన ధర్మాసనం తెలిపింది. వేసవి సెలవుల తర్వాత కోర్టు తిరిగి తెరిచిన తర్వాత ఈ విషయాన్ని సాధారణ బెంచ్‌కు తీసుకురావాలని పిటిషనర్‌కు సూచించింది.

    Supreme Court | విచార‌ణపై ప్ర‌భావం..

    ఉద‌య్‌పూర్ ఫైల్స్ సినిమా(Udaypur Files movie) జులై 11న విడుదల కానుంది. అయితే, ఈ చిత్రం విడుద‌ల‌ను నిలిపి వేయాల‌ని కోరుతూ కన్హయ్య లాల్ హత్య కేసులో ఎనిమిదో నిందితుడు మహమ్మద్ జావేద్(Mohammad Javed) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హ‌త్య కేసు ప్ర‌స్తుతం విచార‌ణ ద‌శ‌లో ఉన్న త‌రుణంలో ఈ చిత్రం విడుద‌ల చేయ‌డం స‌రికాద‌ని, ఇది విచార‌ణ‌పై ప్ర‌భావం చూపుతుంద‌ని పిటిష‌న్‌లో పేర్కొన్నారు.

    ఇలా చేయ‌డం త‌న న్యాయ‌ప‌ర‌మైన హ‌క్కుకు భంగం క‌లిగించ‌డ‌మేన‌ని తెలిపారు. సినిమా ట్రైలర్, ప్రమోషనల్ చిత్రాల‌ను చూస్తే మతపరంగా రెచ్చగొట్టే కంటెంట్ ఉన్న‌ట్లు అనిపించింద‌ని, కోర్టు తీర్పుకు ముందే నిందితులను దోషులుగా చిత్రీకరించార‌ని పిటిష‌న‌ర్ త‌ర‌ఫు న్యాయ‌వాది క‌పిల్ సిబ‌ల్(Lawyer Kapil Sibal) పేర్కొన్నారు. పూర్తి సినిమాను చూశాకే విడుద‌ల‌కు అనుమ‌తించాల‌ని కోరారు. వారి వాద‌న‌ను ప్ర‌భుత్వం త‌ర‌ఫున హాజ‌రైన అడిష‌న‌ల్ సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ చేత‌న్‌శ‌ర్మ తోసిపుచ్చారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కోసం సెన్సార్‌కు వ‌చ్చిన స‌మ‌యంలోనే సెన్సార్ బోర్డు అభ్యంత‌ర‌క‌ర‌మైన కంటెంట్‌ను తొల‌గించింద‌ని తెలిపారు. ఈ నేప‌థ్యంలో సుప్రీంకోర్టు పిటిష‌న్‌ను తిర‌స్క‌రిస్తూ సినిమా విడుద‌ల‌కు అనుమ‌తించింది.

    Supreme Court | టైలర్ హత్యోదంతంపై రూపొందిన చిత్రం..

    రాజస్థాన్‌లోని ఉదయపూర్‌కు(Rajasthan Udaypur) చెందిన దర్జీ కన్హయ్య లాల్ హత్య ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. జూన్ 2022లో మొహమ్మద్ రియాజ్. మొహమ్మద్ గౌస్ ఆయనను హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేత నూపుర్ శర్మ(BJP leader Nupur Sharma) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను సమర్థిస్తూ క‌న్న‌య్య‌లాల్ సోషల్ మీడియా పోస్ట్ చేశారు. దీంతో ఆగ్ర‌హానికి గురైన ఓ వ‌ర్గం వ్య‌క్త‌లు ఆయ‌న‌ను దారుణంగా హ‌త‌మార్చారు.

    దీనిపై జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచార‌ణ చేప‌ట్టింది, అనుమానితులపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా)తో పాటు భారత శిక్షాస్మృతిలోని పలు సెక్ష‌న్ల కింద అభియోగాలు మోపారు. ప్రస్తుతం, జైపూర్‌లోని ప్రత్యేక NIA కోర్టులో విచారణ కొనసాగుతోంది.

    More like this

    Local Body Elections | ఎన్నెన్ని ‘కలలో’.. స్థానిక ఎన్నికల కోసం ఆశావహుల నిరీక్షణ

    అక్షరటుడే, కామారెడ్డి : Local Body Elections | రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై (local body elections)...

    ACB Raid | రూ.4 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన అధికారిణి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raid | అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. కార్యాలయాలకు వచ్చే వారి నుంచి అందిన...

    Sub Collector Vikas Mahato | పీహెచ్​సీ సబ్​సెంటర్​ నిర్మాణం కోసం స్థల పరిశీలన

    అక్షరటుడే, కోటగిరి: Sub Collector Vikas Mahato | పోతంగల్ (Pothangal)​ మండలంలోని హెగ్డేలి(Hegdely) గ్రామానికి మంగళవారం బోధన్​...