అక్షరటుడే, ఇందూరు: Bc Sankshema Sangham | మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో (Panchayat Elections) బీసీ అభ్యర్థులను పెద్దఎత్తున గెలిపించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని బీసీ సంఘం కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
Bc Sankshema Sangham | అగ్రవర్ణాలకు బుద్ధి చెప్పాల్సిందే..
ఆయన మాట్లాడుతూ.. కులాలకు, బంధుత్వాలకు అతీతంగా, ప్రలోభాలకు లొంగకుండా బీసీ అభ్యర్థులకు ఓటు వేయాలన్నారు. జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు రాబోతుండగా అడ్డుకున్న కొందరు అగ్రవర్ణాలకు బుద్ధి చెప్పాలంటే బీసీలంతా ఏకం కావాలన్నారు. అందరూ ఐక్యతతో బీసీలకు ఓట్లేస్తే 70 శాతం పంచాయతీలను గెలిపించుకోవచ్చన్నారు. ఈ సమావేశంలో బీసీ నాయకులు ఆకుల ప్రసాద్, దర్శనం దేవేందర్, శంకర్, వాసం జయ, సాయి, బాలన్న, సురేందర్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.