అక్షరటుడే, కోటగిరి: Bodhan Sub Collector | విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠాలు బోధించాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో (Sub-Collector Vikas Mahato) సూచించారు. రుద్రూర్ మండలం చిక్కడ్పల్లి మండల పరిషత్ ఉన్నత ప్రాథమిక పాఠశాలను ఆయన బుధవారం తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ విద్యార్థులతో (Students) మాట్లాడారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు వేయగా వారు సమాధానం ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయుల బోధనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించినప్పుడే వారు భవిష్యత్తులో ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దబడతారని వివరించారు. అభ్యసన ఫలితాలను మెరుగుపర్చడానికి అవసరమైన పరిష్కార చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. నెమ్మదిగా నేర్చుకునే వారిపై వ్యక్తిగత శ్రద్ధ పెట్టాలని.. మెరుగైన ఫలితాలను సాధించడానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.