HomeజాతీయంBihar Results | బీహార్​ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోవాలి.. డీకే శివకుమార్​ కీలక వ్యాఖ్యలు

Bihar Results | బీహార్​ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోవాలి.. డీకే శివకుమార్​ కీలక వ్యాఖ్యలు

బీహార్​లో ఓటమి ఒక గుణపాటం కావాలని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్​ అన్నారు. భవిష్యత్​లో జరిగే ఎన్నికల కోసం కాంగ్రెస్​తో పాటు విపక్ష ఇండియా కూటమి కొత్త వ్యూహాలను అమలు చేయాలన్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bihar Results | బీహార్​లో ప్రతిపక్ష మహఘట్​బంధన్​ (MGB) కూటమి ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ముఖ్యంగా కేంద్రంలో అధికారం చేపట్టాలని కలలు కంటున్న కాంగ్రెస్​ను బీహార్​ ప్రజలు తిరస్కరించారు. 61 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ ఆరు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. బీహార్​ ఓటమిపై కాంగ్రెస్​ నాయకుడు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar)​ స్పందించారు. ఈ ఓటమి ఒక గుణపాటం కావాలని ఆయన పేర్కొన్నారు.

భవిష్యత్​లో జరిగే ఎన్నికల కోసం కాంగ్రెస్ (Congress)​తో పాటు విపక్ష ఇండియా కూటమి కొత్త వ్యూహాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని డీకే శివకుమార్​ అన్నారు. తాజా ఓటమి తమకు ఓ గుణపాఠం అని ఆయన అభివర్ణించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ తీర్పు ప్రజల నిర్ణయాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. “ప్రజలు ఈ తీర్పును ఇచ్చారు. ఇది మాకు ఒక పాఠం. భవిష్యత్తులో మనం కాంగ్రెస్, ఇండియా కూటమికి కొత్త వ్యూహాన్ని రూపొందిస్తామని నేను భావిస్తున్నాను” అని ఆయన అన్నారు.

Bihar Results | పని చేయని రాహుల్​ ఆరోపణలు

బీహార్​లో గెలుపు కోసం రాహుల్​ గాంధీ (Rahul Gandhi) కేంద్ర ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేశారు. ఓటు చోరీ పేరిట పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహించారు. బీజేపీ, ఎన్నికల సంఘం ఓటు చోరీకి పాల్పడుతున్నాయని ఆరోపించారు. అంతేగాకుండా బీహార్​లో ఓటరు అధికార్​ యాత్ర కూడా చేపట్టారు. అయితే రాహుల్​ గాంధీ వ్యాఖ్యలను బీహార్​ ప్రజలు నమ్మలేదు. ఎంజీబీ కూటమిని తిరస్కరించారు. ఎంఐఎం పార్టీ ఐదు స్థానాల్లో విజయం సాధించగా.. 61 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్​ ఆరు స్థానాలకు పరిమితం కావడం గమనార్హం.

Must Read
Related News