HomeUncategorizedKarnataka | సైలెంట్‌గా ఉన్న చిరుత‌ని రెచ్చ‌గొటారు.. చివ‌రికి ఏమైంది.. వైర‌ల్ వీడియో

Karnataka | సైలెంట్‌గా ఉన్న చిరుత‌ని రెచ్చ‌గొటారు.. చివ‌రికి ఏమైంది.. వైర‌ల్ వీడియో

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karnataka | ఇటీవలకాలంలో సఫారీ టూర్‌లకు వెళ్లే వారి సంఖ్య క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతోంది. అడవుల్లో వన్యప్రాణులను దగ్గరగా చూడాలనే ఉత్సాహంతో పాటు, ఆ అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకోవాలనే తహతహతో చాలామంది ఈ ప్రయాణాలను చేస్తున్నారు. అయితే కొందరు జంతువుల పట్ల బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తూ, వాటిని రెచ్చగొట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. దీంతో ప్రమాదకర ఘటనలు సంభవిస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటన కర్ణాటక(Karnataka)లోని  బన్నీర్‌ఘట్ట నేషనల్ పార్క్‌లో చోటుచేసుకోగా, ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Karnataka | చిరుత‌కి కోపం వ‌చ్చింది..

@IndianBackchod అనే ఎక్స్ యూజర్‌ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియో ప్రకారం, రెండు జీపుల్లో టూరిస్టులు సఫారీ టూర్‌(Safari Tour)లో ఉన్న సమయంలో, రోడ్డుపక్కనే ఓ చిరుతపులి కనిపించింది. ఉత్సాహంతో కొందరు టూరిస్టులు జీప్‌ను ఆపి అరుపులు, కేకలతో చిరుతను (Leopard) రెచ్చగొట్టారు. దీంతో చిరుత ఆగ్రహంతో ఒక జీప్‌ వైపు దూకి దాడికి దిగింది. జీప్ డోర్ దగ్గర కూర్చున్న 13 ఏళ్ల బాలుడి చేతిపై గాయాలు చేసింది. వెంటనే జీప్ డ్రైవర్(Jeep Driver) అప్రమత్తమై వాహనాన్ని ముందుకు నడిపాడు. చిరుత కొద్ది దూరం వరకూ జీప్‌ను వెంబడించింది కానీ ఆ తర్వాత ఆగిపోయింది. ఈ ఘటనను వెనుక ఉన్న మరో జీప్‌లోని వ్యక్తులు వీడియో తీసి, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

గాయపడిన బాలుడిని తక్షణమే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉంది, డిశ్చార్జ్ కూడా చేశారు. వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో వందలాది మంది దీనిపై స్పందించారు. కొంద‌రు నెటిజన్ల ఆగ్రహం వ్య‌క్తం చేశారు. వన్యప్రాణుల ప్రైవసీకి గౌరవం ఇవ్వాలి అంటూ టూరిస్టుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడవిలోకి వెళ్లినవారు బాధ్యతగా ప్రవర్తించాలి, కాని జంతువులను రెచ్చగొట్టడం అనేది చాలా ప్రమాదకరం. వన్యప్రాణుల స్వేచ్ఛను మనం గౌరవించాలి అని కామెంట్స్ చేశారు.