Homeజిల్లాలుకామారెడ్డిNagireddypet | లొంకలపల్లి శివారులో చిరుత కలకలం

Nagireddypet | లొంకలపల్లి శివారులో చిరుత కలకలం

నాగిరెడ్డిపేట ఫారెస్ట్​ బీట్​ పరిధిలోని లొంకపల్లిలో చిరుత సంచరించినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Nagireddypet | నాగిరెడ్డిపేట బీట్ పరిధిలోని లొంకలపల్లి గ్రామ శివారులో చిరుత పులి సంచరిస్తున్నట్లు డీఆర్​వో అరవింద్, బీట్ ఆఫీసర్​ నవీన్ తెలిపారు. గ్రామ శివారులోని పంట పొలాల్లో చిరుత పులి అడుగుజాడలు కనిపించినట్లు స్థానికులు తెలిపారు. చిరుత సంచారంతో స్థానిక రైతులు, ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.

చిరుత సంచరిస్తున్న విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్తామని బీట్​ ఆఫీసర్​ తెలిపారు. లొంకలపల్లి, నాగిరెడ్డిపేట, ధర్మారెడ్డి బొల్లారం బీట్ పరిధిలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.