అక్షరటుడే, తిరుమల: Leopard on Tirumala : తిరుమల ఘాట్ రోడ్డు Tirumala Ghat Roadలో చిరుత సంచారం కలకలం రేపింది.
మొదటి ఘాట్ రోడ్డులో వినాయక స్వామి ఆలయం వద్ద ప్రహరీ గోడపై చిరుత పరుగులు పెడుతూ కనిపించింది. అటుగా వాహనంలో వెళ్తున్న భక్తులు దీనిని కాస్త వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా social media లో వైరల్ Viral అవుతోంది.
కాగా, చిరుత సంచారం నేపథ్యంలో అలిపిరి Alipiri వెంట కాలినడకన వచ్చే భక్తులు జాగ్రత్తగా ఉండాలని టీటీడీ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇతర భక్తులు సైతం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.