అక్షరటుడే, వెబ్డెస్క్ : Leopard | తిరుపతిలో చిరుత సంచారంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. తిరుపతి శ్రీవారి మెట్టు (Tirupati Srivari Mettu) మార్గంలో 150వ మెట్టు దగ్గర చిరుత రోడ్డు దాటుతుండగా శుక్రవారం ఉదయం భక్తులు చూశారు. చిరుతను చూసి భయంతో భక్తులు కేకలు వేశారు. దీంతో అది సమీపంలోని అడవిలోకి వెళ్లిపోయింది.
చిరుత (Leopard) సంచారంపై సిబ్బంది ఉన్నతాధికారులకు సమచారం ఇచ్చారు. టీటీడీ, ఫారెస్ట్ అధికారులు (Forest Officers) అప్రమత్తం అయ్యారు. భక్తులను గుంపులు గుంపులుగా మెట్ల మార్గంలో పంపిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మళ్లీ చిరుత కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని ఫారెస్ట్ అధికారులు భక్తులకు సూచించారు.
కాగా గతంలో సైతం తిరుపతి మెట్ల మార్గంలో చిరుత కనిపించిన విషయం తెలిసిందే. చిరుతలు, ఇతర అటవీ జంతువుల నుంచి భక్తుల రక్షణ కోసం టీటీడీ అధికారులు (TTD Officers) పలు చర్యలు చేపడుతున్నారు. కాగా ఇటీవల తిరుపతిలో ఎస్వీ యూనివర్శిటీ (SV University)లో సైతం చిరుత కలకలం రేగింది. అక్టోబర్ 10న ఎంప్లాయిస్ క్వార్టర్స్ సమీపంలోకి చిరుత సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

