Homeజిల్లాలునిజామాబాద్​Chirutha | ఆర్మూర్​ శివారులో చిరుత కలకలం.. పరిశీలించిన ఫారెస్ట్​ అధికారులు

Chirutha | ఆర్మూర్​ శివారులో చిరుత కలకలం.. పరిశీలించిన ఫారెస్ట్​ అధికారులు

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్​: Chirutha | జిల్లాలో వరుసగా చిరుత పులుల ఆనవాళ్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవల ఎడపల్లి (Yedapally) మండలంలోని జానకంపేట్​లో (janakampet) మేకలపై చిరుత దాడి చేసింది. అనంతరం అభంగపట్నంలోనూ (Abhangapatnam) లేగదూడపై చిరుతపులి దాడి చేసి చంపేసింది.

chirutha | తాజాగా ఆర్మూర్​ పట్టణ శివారులో..

పట్టణ శివారులోని పెద్దమ్మగుడి ఆలయ పరిసరాల్లో పులి కలకలం సృష్టించింది. ఆలయ పరిసరాల్లో పులి తిరుగుతోందని గ్రామస్థులు అటవీశాఖాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆదివారం ఫారెస్ట్​ అధికారులు పెద్దమ్మగుడి పరిసరాలను పరిశీలించారు.

ఇప్పటి నుంచి ఆలయ పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకుంటామని.. నిశితంగా పులి సంచారాన్ని గమనిస్తామని వారు తెలిపారు. భక్తులు సైతం పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించాకే గుడి వద్దకు రావాలని ఫారెస్ట్​ అధికారులు సూచించారు.

Must Read
Related News