అక్షరటుడే, బోధన్: Tiger | నవీపేట(Navipet) మండలంలో చిరుత కలకలం సృష్టించింది. మహంతం(mahantham) శివారులో ఓ దూడపై దాడి చేసి హతమార్చింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహంతం శివారులో ఓ పొలంలోని షెడ్లో రైతు దూడను కట్టేయగా శుక్రవారం అర్ధరాత్రి వేళ చిరుత దాడి చేసింది. సమాచారం అందుకున్న అటవీశాఖాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చిరుతదాడి ఆనవాళ్లను పరిశీలించారు.
Tiger | స్థానికుల భయాందోళన
మహంతంలో చిరుత ఆనవాళ్లు కనిపించడంతో రైతులు భయాందోళనకు గురయ్యారు. పొలాలకు వెళ్లేందుకు భయపడే పరిస్థితి వచ్చిందని వారు వాపోతున్నారు. శుక్రవారం రాత్రి దూడపై దాడి చేసిన ఘటన కారణంగా పొలల్లో పనులకు వెళ్లడం లేదని వారు పేర్కొన్నారు.
Tiger | 15 రోజుల వ్యవధిలో రెండోదాడి..
పదిహేను రోజుల వ్యవధిలోనే చిరుత రెండు వేర్వేరు ప్రాంతాల్లో పశువులపై దాడి చేసిందని గ్రామస్థులు తెలిపారు. ఎడపల్లి (Yedapally) మండలం జానకంపేట్ (janakampet) శివారులో మేకలపై చిరుత దాడి చేసిన ఘటన ప్రజలు మరిచిపోకముందే శుక్రవారం రాత్రి తాజాగా దూడపై చేసింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Tiger | అటవీశాఖాధికారులపై ఆగ్రహం..
రోజుల వ్యవధిలోనే చిరుత రెండుసార్లు దాడులు చేయడంతో సర్వత్రా భయాందోళన నెలకొంది. ఈ ఘటనలపై అటవీశాఖ చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తుండడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనలు జరిగినప్పుడు వచ్చి వివరాలు సేకరించడం తప్ప ఎలాంటి చర్యలు ఉండడం లేదని వారు వాపోతున్నారు. చిరుతను పట్టుకునేందుకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.