Homeజిల్లాలుకామారెడ్డిTiger | లేగదూడపై చిరుత దాడి.. ఎక్కడంటే..

Tiger | లేగదూడపై చిరుత దాడి.. ఎక్కడంటే..

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Tiger | ఉమ్మడి మాచారెడ్డి (machareddy) మండలంలో చిరుత పులుల సంచారం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. పెద్దపులి ఘటన మరువక ముందే రామారెడ్డి(Ramareddy) మండలం అన్నారం (Annaram), గోకుల్ తండాలో (Gokul Thanda) చిరుత సంచారం వెలుగులోకి వచ్చింది.

తాజాగా మాచారెడ్డి మండలం అక్కాపూర్ (Akkapur) గ్రామంలో బుధవారం ఓ లేగదూడపై చిరుత దాడి చేసింది. గ్రామానికి చెందిన అరిగె నర్సయ్య లేగదూడపై చిరుత దాడి చేసింది. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది. అటవీశాఖ అధికారులు (Forest Department) గ్రామానికి చేరుకుని మృతి చెందిన లేగ దూడను పరిశీలించి చిరుత దాడి చేసినట్టు నిర్ధారించారు.

సమీప ప్రాంతాల్లో ట్రాక్ కెమెరాలు(Track cameras) బిగించగా లేగదూడ వద్దకు మళ్లీ వచ్చిన చిరుత దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి. దాంతో చిరుత జాడకోసం అధికారులు గాలిస్తున్నారు.

చిరుత సంచారంతో సమీప గ్రామస్థులను అధికారులు అప్రమత్తం చేశారు. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కూలీలు, పశువుల కాపరులు ఒంటరిగా వెళ్లకూడదని సూచించారు. వరుసగా చిరుత పులుల సంచారంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బోన్ ఏర్పాటు చేసి చిరుతను పట్టుకోవాలని కోరుతున్నారు.