అక్షరటుడే, వెబ్డెస్క్: Leopard Attack | కలియుగ ప్రత్యక్ష దైవంగా పూజించబడే శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలలో (Tirumala) శుక్రవారం రాత్రి చిరుతపులి హల్‌చల్ చేసింది. అలిపిరి ఎస్‌వీ జూ పార్క్ రోడ్డులో బైక్‌పై వెళ్తున్న ఇద్దరిపై చిరుత ఒక్కసారిగా దాడి చేయబోయింది. అదృష్టవశాత్తు వారు తృటిలో తప్పించుకోగలిగారు. సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతున్న వీడియో ప్రకారం, పొదలలో దాగి ఉన్న చిరుత బైక్‌ను చూసి ఒక్కసారిగా దూకింది. అయితే బైక్ వేగంగా ఉండడంతో చిరుత దాడి విఫలమైంది. చిరుత బైక్‌ను స్వల్పంగా ఢీకొట్టి కిందపడిపోయింది.
Leopard Attack | రెప్పపాటులో..
ఈ దృశ్యం వెనక కారు డ్యాష్ బోర్డు కెమెరాలో (dashboard camera) రికార్డు అయింది. ఆ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఇటీవల కాలంలో తిరుమల పరిధిలో చిరుతల సంచారం పెరిగిన విషయం తెలిసిందే. గత రెండు సంవత్సరాల్లో చిరుత దాడులతో పలువురు భక్తులు గాయపడగా, ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. టీటీడీ, అటవీశాఖ అధికారులు (TTD and forest officials) ఇప్పటికే చిరుతల బందోబస్తు కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు.
చిరుత (Leopard) దాడికి సంబంధించిన తాజా వీడియో వైరల్ (Video Viral) కావడంతో అధికారులు వెంటనే స్పందించారు. రాత్రి వేళల్లో తిరుమల ఘాట్ రోడ్డుపై ద్విచక్ర వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం రోజున మొత్తం 73,576 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 25,227 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ హుండీలకు రూ. 4.23 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారికంగా ప్రకటించింది.
View this post on Instagram