అక్షరటుడే, కామారెడ్డి: Collector Ashish Sangwan | ఎన్నికల ప్రక్రియలో పూర్తి బాధ్యతాయుతంగా ఉండాలని, పొరపాట్లు చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులకు (presiding officers) సూచించారు. సదాశివనగర్ (Sadashivnagar) మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో జరుగుతున్న ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా జరగాలంటే పూర్తి అవగాహన ఉండాలని, శిక్షణ కార్యక్రమం సద్వినియోగం చేసుకొని సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని సూచించారు. పొరపాట్లు జరగకుండా చూసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి మురళి(DPO Murali), జిల్లా పరిషత్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రమేష్ బాబు, డివిజనల్ పంచాయతీ అధికారి శ్రీనివాస్, ఎంపీడీవో సంతోష్ కుమార్, తహశీల్దార్ సత్యనారాయణ, మండల విద్యాధికారి యోసఫ్, మండల పంచాయతీ అధికారి సురేందర్, మాస్టర్ శిక్షకులు పాల్గొన్నారు.