219
అక్షరటుడే, బోధన్: Yedapally Mandal | అసభ్య పదజాలంతో లెక్చరర్ దూషిస్తుండడంతో విద్యార్థినులు తట్టుకోలేకపోయారు. తరచూ తిట్ల పురాణం వినలేక విసుగెత్తి తరగతుల నుంచి బయటకు వచ్చి ఆందోళనకు దిగారు. ఈ ఘటన ఎడపల్లి మండలంలోని (Yedapally Mandal) తెలంగాణ రెసిడెన్షియల్ బాలిక జూనియర్ పాఠశాల, కళాశాలలో గురువారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కళాశాలలోని ఓ మహిళా లెక్చరర్ తరచూ తమను అసభ్య పదజాలంతో దూషిస్తోందని పేర్కొంటూ విద్యార్థులు తరగతులు బహిష్కరించారు. కళాశాల ఆవరణలో భైఠాయించారు. కళాశాలలో లెక్చరర్ వేధింపులు తాము తట్టుకోలేకపోతున్నామని వాపోయారు. దీంతో వెంటనే స్పందించిన ఇతర లెక్చరర్లు విద్యార్థులను సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ ఉపయోగం లేదు. విద్యార్థులు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు.