HomeతెలంగాణNizamabad City | మండపాలకు ఇరువైపులా దారి వదలాలి : సీపీ

Nizamabad City | మండపాలకు ఇరువైపులా దారి వదలాలి : సీపీ

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | మండపానికి పక్క నుంచి అంబులెన్స్​లు, సామాన్య ప్రజానీకం వెళ్లడానికి దారి వదలాలని పోలీస్ కమిషనర్ సాయిచైతన్య (CP Sai Chaitanya) సూచించారు.

అత్యవసర సమయాల్లో అంబులెన్స్​లు వెళ్లడానికి ఎక్కడ ఇబ్బందులు కలిగించకూడదన్నారు. సామాన్య ప్రజలకు, నడకదారిన వెళ్లే ప్రజలకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యం కలిగించవద్దని సూచించారు. గణేష్ మండపాలు రోడ్లపై ఏర్పాటు చేసేవారు ఎడమవైపు, కుడి వైపున రహదారి వదిలి ఏర్పాటు చేయాలన్నారు. ఇందులో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ (Nizamabad Police Commissionerate) పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో సంబంధిత అధికారులు తమ పరిధిలో గల గణేష్ మండపాల యాజమానులకు సంబంధిత ఆర్గనైజర్లకు ఆదేశాలు జారీ చేశారు.

ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ఇన్​స్పెక్టర్​ ప్రసాద్​ ఆధ్వర్యంలో సిబ్బంది మండపాలకు ఇరువైపులా గల హాస్పిటల్ బోర్డులు, మెట్లు పోల్స్ తొలగించి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుకుండా ఏర్పాట్లు చేశారు. ప్రజలు గణేష్ మండపాన్ని ఏర్పాటు చేసే ముందు దారిలో ఏర్పాటు చేయకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.