అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kishan Reddy | రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలని ప్రధాని మోదీ సూచించినట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు కొన్ని సూచనలు చేశారన్నారు. మంగళవారం ఆయన మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు.
ప్రధాని మోదీ (Prime Minister Modi) ఇటీవల రాష్ట్ర బీజేపీ ఎంపీలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఎంపీలకు ప్రధాని క్లాస్ పీకారని వార్తలు వచ్చాయి. 8 మంది ఎంపీలు ఉన్నా ప్రధాన ప్రతిపక్షంగా ఎందుకు ఎదగలేకపోతున్నామని ప్రశ్నించినట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై తాజాగా కిషన్‌రెడ్డి స్పందించారు. సోషల్ మీడియా (Social Media)లో యాక్టివిటీ పెంచాలని ప్రధాని సూచించారని చెప్పారు. లోపల జరిగింది ఒకటి, బయట ప్రచారం చేసింది మరొకటి అన్నారు.
Kishan Reddy | లీక్ చేయడం తప్పు
ప్రధాని మోదీ సమావేశ వివరాలను లీక్ చేయడం కచ్చితంగా తప్పే అని ఆయన అన్నారు. తెలంగాణ ఎంపీ (Telangana MP)లకు ప్రధాని క్లాస్ తీసుకున్నారని తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లీక్ వీరులు ఎవరో తెలిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సమావేశం విషయాలు బయటకు చెప్పవద్దని ప్రధాని స్వయంగా చెప్పారన్నారు. లీకులు ఇచ్చిన నేతలు మెంటలోళ్లు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దక్షిణ భారతదేశ నుంచి ఇప్పటివరకు ఇద్దరు ఉపరాష్ట్రపతులు అయ్యారని తెలిపారు. బీజేపీ (BJP)లో కార్యకర్త స్థాయి నుంచి అధ్యక్షుడి స్థాయి వరకు వెళ్లే అవకాశం ఉంటుందన్నారు.
Kishan Reddy | మర్యాదపూర్వక భేటీ
ప్రధాని రాష్ట్ర ఎంపీలతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారని కిషన్‌రెడ్డి తెలిపారు. అన్ని రాష్ట్రాల ఎంపీలను పిలిచినట్లే, తమను పిలిచారన్నారు. అంతర్గత వివరాలను బయట పెట్టడం పార్టీ ఐక్యతకు భంగం కలిగిస్తుందన్నారు. వోటు చోరీపై రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపణలను ఆయన ఖండించారు. ప్రధాని స్థాయిని తగ్గించేలా ఆయన మాట్లాడుతున్నారని విమర్శించారు. లోక్‌సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉండటం దేశానికి దురదృష్టకరమన్నారు.