Homeజిల్లాలునిజామాబాద్​Kaleshwaram | కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్​ను తిలకించిన నేతలు

Kaleshwaram | కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్​ను తిలకించిన నేతలు

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారంపై మంగళవారం బీఆర్​ఎస్​ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్​లో (Telanagana Bhavan) పవర్ పాయింట్ ప్రజంటేషన్ (PowerPoint presentation) నిర్వహించారు.

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్​రావు (MLA Harish Rao) పవర్​ పాయింట్​ ప్రజంటేషన్​ ఇచ్చారు. ఈ ప్రజంటేషన్​ను తిలకించేందుకు జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ (Former MLA Gampa Govardhan) నివాసంలో ప్రత్యేక ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. జిల్లా మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, జాజాల సురేందర్ (Jajala Surender), హన్మంత్ షిండే (Hanmant Shinde), బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దీన్ (Mujibuddin) ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. కార్యక్రమంలో బాన్సువాడ మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ జుబేద్, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

Must Read
Related News