97
అక్షరటుడే, వెబ్డెస్క్: BJP State President | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును (BJP State President Ramchander Rao) పార్టీ నాయకులు శుక్రవారం కలిశారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం (Jakranpally mandal) తొర్లికొండకు రాగా ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.
జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని ఆయన వారికి సూచించారు. రాష్ట్ర అధ్యక్షుడిని కలిసిన వారిలో బీజేపీ సీనియర్ నేత అల్జపూర్ శ్రీనివాస్, బీజేవైఎం నాయకులు రాజశేఖర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు వంశీ గౌడ్, అధికార ప్రతినిధి సంజీవ్ గౌడ్, తొర్లికొండ సర్పంచ్ పద్మ నాగరాజు, వార్డ్ మెంబర్లు కొయ్యల భారతి, పుడరి అరుణ, గడ్డం రూప, ఈర్ల రోజా, అశోక్ తదితరులు ఉన్నారు.
