HomeUncategorizedActress Laya | చెప్పులు లేకుండా సినిమా మొత్తం పరిగెత్తాను.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసి ల‌య‌

Actress Laya | చెప్పులు లేకుండా సినిమా మొత్తం పరిగెత్తాను.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసి ల‌య‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Heroine Laya | ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన లయ పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు దూర‌మైంది. ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోంది. దాదాపు ఇరవై ఏళ్ల త‌ర్వాత బలమైన పాత్రలు పోషించేందుకు రెడీ అవుతుంది. తాజాగా ఆమె తమ్ముడు చిత్రం(Thammadudu movie)తో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. నితిన్‌ హీరో(Nithin hero)గా రూపొందిన ఈ చిత్రం వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్క‌గా, ఈ చిత్రాన్ని దిల్‌ రాజు, శిరీష్ నిర్మించారు. ఈ మూవీ జూలై 4న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలో ల‌య‌.. నితిన్‌కి అక్క‌గా క‌నిపించ‌నుంది. ఝాన్సీ కిరణ్మయి పాత్రలో నితిన్‌కి అక్కగా ల‌య అద‌ర‌గొట్టింద‌ని అంటున్నారు.

Actress Laya | పాత్ర‌లో ఇన్వాల్స్..

ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ట్రైలర్‌(Trailer) ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలను పెంచింది. అక్కకు ఇచ్చిన మాట కోసం తమ్ముడు చేసే పోరాటమే ఈ సినిమా అని తెలుస్తోంది. యాక్షన్‌ థ్రిల్లర్‌(Action thriller)గా ఈ మూవీ సాగుతుందని ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతుంది. నితిన్‌ చాలా ఏళ్ల తర్వాత హిట్‌ కొట్టబోతున్నాడనే హింట్‌ ని ఈ చిత్రం ఇస్తోంది. మరి అది ఎంత వరకు సాధ్యమవుతుందో చూడాలి. అయితే ఇందులో లయ పాత్ర బలంగా ఉండబోతుందని తెలుస్తోంది. యాక్ట్రిస్​ లయ(Actress Laya) తాజాగా తన నటన అనుభవాలను గుర్తు చేసుకుంటూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, త‌మ్ముడు సినిమాలో తన పాత్రలో ఎంతగా ఒదిగిపోయిందో చెప్పుకొచ్చింది.

చెప్పులు లేకుండానే సినిమా మొత్తం పరిగెత్తాను అంటూ ఆమె చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక సీన్ కోసం మాత్రం చెప్పులు లేకుండా ఉండాలని మొదట అనుకున్నా.. కానీ షూటింగ్ మొత్తం అదే క్యారెక్టర్‌(Character)లో ఉండిపోయాను. సీన్ల మధ్య చెప్పులు వేసుకుంటుంటే నేచురల్‌గా ఉండదంటూ ద‌ర్శ‌కుడు చెప్పారు. దాంతో నేను చెప్పులు వేసుకోకుండా అన్ని సన్నివేశాల్లో నటించాను అని లయ పేర్కొన్నారు. లయ క‌మింట్‌మెంట్ పట్ల సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తోంది. నిజమైన నటన అంటే ఏంటో చూపినందుకు ఆమెను అభినందిస్తూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.