అక్షరటుడే,నిజామాబాద్ సిటీ : Lawyers Protest Nizamabad | న్యాయవాదిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని లాయర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం నిజామాబాద్ బార్ అసోసియేషన్ (Nizamabad Bar Association) ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి కోర్టు ఎదుట ధర్నా చేశారు.
Lawyers Protest Nizamabad | మహిళా న్యాయవాదిపై దాడిని ఖండిస్తున్నాం..
ఈ సందర్భంగా న్యాయవాది పరిషత్ జిల్లా అధ్యక్షుడు జగన్ మోహన్ గౌడ్ మాట్లాడుతూ బోధన్ బార్ అసోసియేషన్‌లో (Bodhan Bar Association) ప్రాక్టీస్ చేస్తున్న మహిళా న్యాయవాది కళ్యాణిపై ఆదివారం రుద్రూర్లో గుండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. దాడిపై న్యాయవాది రుద్రూర్ పోలీస్ స్టేషన్లో (Rudrur Police Station) వెంటనే ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పూర్తిగా నిర్లక్ష్యం వహించడం ఇంతవరకు దుండగులను అరెస్ట్ చేయకుండా ఉదాసీన వైఖరి అవలంభించడం శోచనీయమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులపై జరుగుతున్న ఇలాంటి విషయాలు హింసాత్మక దాడులు ప్రజాస్వామ్య వ్యవస్థకు, న్యాయవ్యవస్థకు సవాల్‌గా మారుతున్నాయి.
Lawyers Protest Nizamabad | వెంటనే అరెస్ట్ చేయాలి..
మహిళా న్యాయవాదిపై దాడికి పాల్పడ్డ దుండగులను వెంటనే గుర్తించి, హత్యాయత్నం కింద కేసులు నమోదు చేయాలని వారు జగన్ మోహన్ గౌడ్ కోరారు. కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీస్ శాఖను (Police Department) న్యాయవాది పరిషత్ డిమాండ్ చేస్తోందన్నారు. అనంతరం బోధన్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాయి రెడ్డి, ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు, ఉపాధ్యక్షుడు సురేష్ తదితరులు పాల్గొన్నారు.
