అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy Court | ఎల్లారెడ్డి కోర్టులో (Yellareddy Court) బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై (Supreme Court judge) న్యాయవాది దాడి చేసేందుకు యత్నించడానికి వారు తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ (Bar Association) అధ్యక్షుడు గోపాల్రావు మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థకు భంగం కలిగించే ఎలాంటి చర్యలైనా సహించేది లేదని పేర్కొన్నారు. న్యాయవాదుల హక్కులు, న్యాయస్థానాల గౌరవం కాపాడడంలో బార్ అసోసియేషన్ ఎల్లప్పుడూ ముందుండి పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. కోర్టుల గౌరవాన్ని కాపాడుకోవడం సమాజంలోని ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. సుప్రీంకోర్టులో జరిగిన సంఘటన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చ అని అభిప్రాయపడ్డారు. నిరసన కార్యక్రమంలో న్యాయవాదులు పద్మ పండరి, సతీష్, నామ శ్రీకాంత్, నాగం సాయిబాబా, నామ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.