Yellareddy Court
Yellareddy Court | న్యాయవాదుల విధుల బహిష్కరణ

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy Court | ఎల్లారెడ్డి మున్సిపల్​ కోర్టులో (Yellareddy Municipal Court) శుక్రవారం న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు.

ఎల్లారెడ్డి బార్ అసోసియేషన్ (Yellareddy Bar Association) అధ్యక్షుడు గోపాల్ రావు నేతృత్వంలో న్యాయవాదుల అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇందులో విధులు బహిష్కరించాలనే తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు.

ఇటీవల ఇబ్రహీంపట్నం పోలీస్​స్టేషన్ (Ibrahimpatnam Police Station)​ పరిధిలో ఇద్దరు న్యాయవాదులపై దాడికి నిరసనగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లుగా వారు పేర్కొన్నారు. విధుల బహిష్కరణలో న్యాయవాదులు సతీష్, శ్రీకాంత్, నావిద్, పద్మ పండరి, సాయి ప్రకాష్ దేశ్ పాండే, నాగం సాయిబాబా, నామ శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ సభ్యులు దాడి ఘటనను ఖండిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.