Homeజిల్లాలుకామారెడ్డిYellareddy | న్యాయవాదుల విధుల బహిష్కరణ

Yellareddy | న్యాయవాదుల విధుల బహిష్కరణ

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy | పట్టణంలో బార్​ అసోసియేషన్​ ఆధ్వర్యంలో న్యాయవాదులు తమ విధులను బహిష్కరించారు. అనంతరం ఎల్లారెడ్డి(Yellareddy) కోర్టు ఎదుట నిరసన తెలిపారు.

Yellareddy | కూకట్​పల్లిలో ఘటనపై..

ఈ సందర్భంగా ఎల్లారెడ్డి బార్​ అసోసియేషన్​ అధ్యక్షుడు నవీద్​ మాట్లాడుతూ హైదరాబాద్​లోని కూకట్​పల్లి(Kukatpally)లో బార్​ అసోసియేషన్​ ఈసీ సభ్యుడు తన్నీరు శ్రీకాంత్​(EC Member Thanniru Srikanth)పై గుర్తు తెలియని వ్యక్తులు ఇటీవల దాడి చేశారన్నారు. ఈ దాడిని నిరసిస్తూ తాము విధులను బహిష్కరించినట్లు తెలిపారు.తెలంగాణ బార్​ అసోసియేషన్​ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు తమ విధులను బహిష్కరించామని ఆయన పేర్కొన్నారు. న్యాయవాదులపై దాడులను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు నవీద్(Bar Association President Naveed)​ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. హైదరాబాద్​లో న్యాయవాదిపై దాడులు చేసిన వారికి కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా వారు ఈ సందర్భంగా కోరారు. నిరసన కార్యక్రమంలో బార్​ అసోసియేషన్​ ప్రతినిధులు, న్యాయవాదులు పాల్గొన్నారు.