అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Nizamabad City | తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఉద్యమకారుడు, ప్రముఖ న్యాయవాది (Lawyer) పెద్దగాని కిరణ్కుమార్ గౌడ్ (57) (Peddagani Kiran Kumar Goud) శుక్రవారం గుండెపోటుతో మృతిచెందారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా (Former MLA Bigala Ganesh Gupta) ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. నిజామాబాద్ బీఆర్ఎస్ (BRS) ముఖ్య సలహాదారుడిగా ఆయన పార్టీకి ఎంతో సేవ చేశారని బిగాల పేర్కొన్నారు. కిరణ్కుమార్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని.. వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని ఆయన కోరారు.