అక్షరటుడే, ఇందూరు: Mp Arvind | కాంగ్రెస్ పార్టీ నాయకుల ఒత్తిడితో జిల్లాలో లా అండ్ ఆర్డర్ (Law and Order) దెబ్బతింటుందని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్యతో (Police Commissioner Sai Chaitanya) సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల బోధన్‌లో (Bodhan) ఎన్ఐఏ (NIA) ఓ యువకుడిని అరెస్టు చేయడంతో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.
ఇలాంటి ఘటనలు సమాజాన్ని భయాందోళనలు కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయం కోసం పోలీసులపై ఒత్తిడి తెస్తోందన్నారు. గతంలో బీఆర్ఎస్ (BRS), ప్రస్తుతం కాంగ్రెస్ ఒకే మాదిరిగా ప్రవర్తిస్తున్నాయని పేర్కొన్నారు. హిందువులన్న, హిందూ పండుగలు అన్న చులకన భావంతో చూస్తున్నారని, హిందువులంటేనే నిబంధనలు గుర్తుకొస్తున్నాయని విమర్శించారు.
ఇటీవల నవీపేటలో (Navipet) ఓ రాజస్థానీ యువకుడు గణపతిపై కాషాయ జెండా ఎగురవేస్తే, ఫొటోలో అది కాస్త మసీదుపై పెట్టినట్లు వచ్చిందన్నారు. దీంతో అక్కడి ముస్లింలు బైక్ ర్యాలీలతో విధ్వంసం సృష్టించారని పేర్కొన్నారు. వారిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆ యువకుడిని రాజస్థాన్ పంపాలంటూ ఒత్తిడి తెస్తున్నారని, దేశంలోకి బంగ్లాదేశ్(Bangladesh), మయన్మార్ల (Myanmar) నుంచి ఎందరో అక్రమంగా ప్రవేశించారన్నారు. వారిని కూడా పంపాలని డిమాండ్ చేశారు. ఏ మతం వారు తప్పు చేసినా.. వారిని అరెస్టు చేయడం సమంజసమే కానీ.. మతాన్ని లాగడం సరికాదన్నారు.