HomeUncategorizedLavanya Tripathi | తొలిసారి బేబి బంప్‌తో క‌నిపించిన లావ‌ణ్య త్రిపాఠి.. త్వ‌ర‌లోనే గుడ్ న్యూస్

Lavanya Tripathi | తొలిసారి బేబి బంప్‌తో క‌నిపించిన లావ‌ణ్య త్రిపాఠి.. త్వ‌ర‌లోనే గుడ్ న్యూస్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​ :Lavanya Tripathi | వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంట పెళ్లికిముందే విహార యాత్రలు వెళ్లారు. కొంత కాలం పాటు సీక్రెట్‌గా ప్రేమాయ‌ణం న‌డిపించి 2023లో వివాహం చేసుకున్నారు. వీరిద్ద‌రిని చూసిన ఎవ‌రైనా కూడా మేడ్ ఫ‌ర్ ఈచ్ అద‌ర్ అంటారు. పెళ్లైన‌ప్ప‌టి నుండి లావ‌ణ్య- వ‌రుణ్ తేజ్‌ (Varun Tej) ఎంతో అన్యోన్యంగా ఉంటూ అంద‌రి దృష్టిని ఆకర్షిస్తున్నారు. వివాహం తర్వాత లావణ్య (Lavanya Tripathi) యాక్టింగ్‌ కెరీర్‌కి కాస్త బ్రేక్‌ ఇచ్చారు. ఆ తర్వాత ఎలాంటి సినిమాకు సైన్‌ చేయలేదు. పూర్తిగా వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టిన‌ట్టు తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితం స‌తీ లీలావ‌తి అనే ప్రాజెక్ట్ ప్ర‌క‌టించింది లావ‌ణ్య‌.

Lavanya Tripathi | బేబి బంప్‌తో..

థనల్ అనే తమిళ మూవీ షూటింగ్ కంప్లీట్‌ చేశారు. ఈ సమయంలో ఆమె ఒక వెబ్ సిరీస్‌లో న‌టించింది. కొత్త ప్రాజెక్టులు ఏవి చేస్తున్న‌ట్టుగా క‌నిపించ‌డం లేదు. రీసెంట్ గానే ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు ఈ మెగా కపుల్(Mega Couple). తమ ఇంట్లో త్వరలో చిన్నారి సందడి చేయబోతున్నట్టు అఫీషయల్ గా అనౌన్స్ చేశారు. ఇక ఫస్ట్ టైమ్ బేబీ బంప్(Baby bump)తో కనిపించింది లావణ్య త్రిపాఠి.

తావరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మాల్దీవులకు వెకేషన్ కోసం వెళ్ల‌గా, అక్కడ ఇద్దరు స్టార్ కపుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈక్రమంలో ఒక పిక్‌ని లావ‌ణ్య త్రిపాఠి (Lavanya Tripathi) షేర్ చేసింది.ఇన్‌స్టాలో భ‌ర్త‌తో క‌లిసి దిగిన పిక్‌ని లావ‌ణ్య షేర్ చేయగా, ఇందులో లావ‌ణ్య బేబి బంప్‌తో క‌నిపించింది. దాంతో ఫ్యాన్స్ సంతోషం వ్య‌క్తం చేస్తూ.. వెయిటింగ్ అంటూ ఆ పోస్ట్‌కి కామెంట్స్ పెడుతున్నారు.

వరుణ్- లావణ్య మొదటిసారి 2017లో వచ్చిన సినిమా ‘మిస్టర్’ సినిమా సెట్స్‌లో కలుసుకున్నారు. ఆ తర్వాత ఈ జంట 2018లో ‘అంతరిక్షం’ సినిమా సమయంలో మరింత దగ్గరయ్యారు. అప్పుడు వారి మ‌ధ్య స్నేహం ఏర్ప‌డింది. అది క్ర‌మంగా ప్రేమ‌గా మారి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ కపుల్స్​లో ఈ జంట కూడా ఒకటి. వీరికి సంబంధించిన ఏ ఫొటో బ‌య‌ట‌కు వ‌చ్చినా కూడా అది నెట్టింట వైర‌ల్ అవుతూ ఉంటుంది. ఇక ఇదిలా ఉంటే వ‌రుణ్ తేజ్ ప్ర‌స్తుతం ‘కొరియన్ కనకరాజు’ అనే హార్రర్- కామెడీ మూవీ కోసం సిద్ధమవుతున్నారు. ఈ సినిమాను మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్నారు.