అక్షరటుడే, బాన్సువాడ: Volleyball competitions | సౌత్ ఇండియా యూనివర్సిటీ స్థాయి వాలీబాల్ పోటీలకు బాన్సువాడ మండలం (Banswada mandal) కొత్తబాది గ్రామానికి చెందిన ధారావత్ లావణ్య ఎంపికైంది. ఆమె మహాత్మా గాంధీ యూనివర్సిటీ (Mahatma Gandhi University) మహిళల వాలీబాల్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనున్నారు.
లావణ్య జెడ్పీహెచ్ఎస్ తిర్మలాపూర్ పాఠశాలలో 10వ తరగతి వరకు విద్యాభ్యాసం పూర్తిచేసింది. బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివింది. బాన్సువాడ ఎస్ఎస్ఎల్ కాలేజీలో డిగ్రీ చదివింది. ప్రస్తుతం నల్గొండలోని ముసుకు మధుసూదన్ రెడ్డి కళాశాలలో బీపీడీ కోర్సు చదువుతోంది.
Volleyball competitions | తమిళనాడులోని చెన్నైలో..
ఈనెల 15 నుంచి 19 వరకు తమిళనాడులోని (Tamil Nadu) చెన్నై ఎస్ఆర్టీఎంయూ యూనివర్సిటీలో నిర్వహించే సౌత్ ఇండియా యూనివర్సిటీ వాలీబాల్ టోర్నీలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ జట్టును కెప్టెన్గా లావణ్య ప్రాతినిథ్యం వహించనుంది. ఈ ఘనత సాధించడంపై కొత్తబాది గ్రామస్థులు, ముసుకు మధుసూదన్ రెడ్డి కళాశాల ప్రిన్సిపాల్ సంజయ్ సాహు, కోచ్ సురేందర్ తదితరులు ఆమెను అభినందించారు. గ్రామానికి, కళాశాలకు లావణ్య గర్వకారణమని వారు పేర్కొన్నారు.