అక్షరటుడే, హైదరాబాద్ : Aparna Pharmaceuticals | యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రిడియెంట్స్ (ఏపిఐ లు), అడ్వాన్స్‌డ్ డ్రగ్ ఇంటర్మీడియట్స్ కు సంబంధించి ప్రముఖ తయారీ సంస్థ అయిన అపర్ణ ఫార్మాస్యూటికల్స్, నేడు తమ వృద్ధి ప్రయాణంలో రెండు ముఖ్యమైన మైలురాళ్లను చేరుకున్నట్లు వెల్లడించింది.
వీటిలో ఒకటి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరంలో ఉన్న కంపెనీ తయారీ కేంద్రం, అపర్ణ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్, యూరోపియన్ యూనియన్ గుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ (ఈయుజిఎంపి) సైట్ ఆమోదాన్ని పొందడం కాగా, మరొకటి , భారతదేశంలో మొట్టమొదటి వ్యవస్థీకృత లైఫ్ సైన్సెస్ క్లస్టర్ అయిన హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో 7,300 చదరపు అడుగుల విస్తీర్ణంలో తమ అత్యాధునిక పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రమైన అపర్ణ లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్(Aparna Laboratories Private Limited)ను ప్రారంభించడం. ఈ పురోగతులు ఔషధ తయారీ, పరిశోధనలో నాణ్యత, ప్రమాణాలను అనుసరించటం , ఆవిష్కరణల పట్ల అపర్ణ నిబద్ధతను నొక్కి చెబుతున్నాయి.
ఈయుజిఎంపి క్లియరెన్స్ పొందడంతో పాటు, క్లోపిడోగ్రెల్ హైడ్రోజన్ సల్ఫేట్ కోసం దాని మొదటి సర్టిఫికేట్ ఆఫ్ సూటిబిలిటీ (సిఈపి)ని కూడా అపర్ణ ఫార్మాస్యూటికల్స్(Aparna Pharmaceuticals) పొందింది. ఈయుజిఎంపి సర్టిఫికేషన్ ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుంది, యూరోపియన్ మార్కెట్లకు అధిక-నాణ్యత గల మందులను సరఫరా చేయడం ద్వారా కంపెనీ తమ ప్రపంచ కార్యకలాపాలను మరింత విస్తరించడానికి వీలు కల్పిస్తుంది.
పైడిభీమవరం కేంద్రం, గత సంవత్సరం ప్రారంభంలో యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యుఎస్ఎఫ్ డిఏ) నుండి అనుమతులు పొందింది. డబ్ల్యుహెచ్ఓ – జిఎంపి మరియు సిడిఎస్సిఓ నుండి సర్టిఫికేషన్లతో పాటు, తాజాగా ఈయుజిఎంపి గుర్తింపుతో, ఈ కేంద్రం ఇప్పుడు బహుళ అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలను అందుకున్నట్లు అయింది. విశ్వసనీయ ప్రపంచ ఆరోగ్య సంరక్షణ భాగస్వామిగా అపర్ణ ఫార్మాస్యూటికల్స్ తన స్థానాన్ని బలోపేతం చేసుకుంది.
ఈ గుర్తింపు గురించి అపర్ణ ఫార్మాస్యూటికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రాకేష్ రెడ్డి(Managing Director Shri Rakesh Reddy) మాట్లాడుతూ, “ఈ పరిణామాలు అపర్ణ ఫార్మాస్యూటికల్స్‌కు ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలుస్తాయి. ఎందుకంటే మేము నాణ్యత , అత్యున్నత ప్రపంచ ప్రమాణాలను మా కార్యకలాపాలతో అనుసంధానించడం కొనసాగిస్తున్నాము. ఈయుజిఎంపి ఆమోదం, జీనోమ్ వ్యాలీలో మా ఆర్&డి కేంద్రాన్ని(R&D Center) ప్రారంభించడం వంటివి, ప్రపంచ స్థాయిలో ప్రామాణీకరణ, నిరంతర ఆవిష్కరణల పట్ల మా అచంచలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తాయి. ఈ విజయాలు నియంత్రిత మార్కెట్లకు సేవ చేయగల మా సామర్థ్యాన్ని బలోపేతం చేస్తాయి, సంక్లిష్ట అణువుల అభివృద్ధిని వేగవంతం చేస్తాయి, ప్రయోజనకర రంగాలలో ఆర్ &డి ని కొనసాగించగలవు, ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో విశ్వసనీయ భాగస్వామిగా మారాలనే మా లక్ష్యం సాకారం చేస్తాయి” అని అన్నారు.
దాదాపు 170,000 చదరపు మీటర్ల (~40 ఎకరాలు) విస్తీర్ణంలో విస్తరించి ఉన్న పైడిభీమవరం కేంద్రం(Pydibhimavaram Center), ప్రస్తుతం బహుళ చికిత్సా రంగాలలో నెలకు సుమారు 250 మెట్రిక్ టన్నుల ఫార్మాస్యూటికల్ ఏపిఐ లు మరియు అధునాతన ఇంటర్మీడియట్‌లను ఉత్పత్తి చేస్తుంది. తయారీ, ఆర్&డి మరియు ప్రమాణాల అనుసరణలో నిరంతర పెట్టుబడులతో, కంపెనీ రాబోయే ఐదు సంవత్సరాలకు 30% కంటే ఎక్కువ సిఏజిఆర్ లక్ష్యంగా పెట్టుకుంది, నియంత్రిత మార్కెట్ల నుండి బలమైన డిమాండ్, పోర్ట్‌ఫోలియో విస్తరణ మరియు కస్టమ్ తయారీ ప్రాజెక్టులపై ప్రపంచ ఆరోగ్య సంరక్షణ భాగస్వాములతో విస్తృత స్థాయి భాగస్వామ్యాల ద్వారా ఇది సాధ్యం కానుంది.
ఈ వృద్ధి వ్యూహానికి అనుగుణంగా, అపర్ణ ఫార్మాస్యూటికల్స్ యొక్క కొత్త ఆర్&డి కేంద్రం తమ అంతర్గత ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకుంది, అదే సమయంలో ప్రాధాన్యత సిడిఎంఓ భాగస్వామిగా తనను తాను నిలబెట్టుకోవడం, ప్రపంచ ఆరోగ్య సంరక్షణ నాయకులకు వినూత్నమైన మరియు నమ్మదగిన పరిష్కారాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ విజయాలపై ఆధారపడి, అపర్ణ ఫార్మాస్యూటికల్స్ తన ఆవిష్కరణ-నేతృత్వంలోని వృద్ధి ప్రయాణాన్ని వేగవంతం చేయడానికి, ప్రపంచ నియంత్రిత మార్కెట్లలో తమ కార్యకలాపాలను విస్తృతం చేయడానికి , ప్రపంచవ్యాప్తంగా సురక్షితమైన, ప్రభావవంతమైన, సరసమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను ముందుకు తీసుకెళ్లడానికి అర్థవంతంగా దోహదపడటానికి సిద్ధంగా ఉంది.