అక్షరటుడే, ఎల్లారెడ్డి: Panchayat Elections | గ్రామపంచాయతీ ఎన్నికల (Gram Panchayat elections) రెండో విడత ప్రచార పర్వం ముగిసి రేపు పోలింగ్‌కు అంతా సిద్ధమైంది. మరోవైపు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు అన్నిరకాల అస్త్రశస్త్రాలు ఉపయోగిస్తున్నారు. మందు, విందు, డబ్బులు ఎరచూపి ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అన్నిరకాలుగా గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు.
Panchayat Elections | పోలింగ్‌కు కొన్నిగంటల ముందు..
పోలింగ్ ఆదివారం ఉదయం నుంచి ప్రారంభం కానుండగా.. శనివారం నిశిరాత్రిలో అభ్యర్థులు ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. రెండో విడతలో కామారెడ్డి జిల్లాలో (Kamareddy district) 153 గ్రామపంచాయతీలో సర్పంచ్ 873 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు తమ అనుచరులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను అభ్యర్థించారు.
Panchayat Elections | మందు,విందు ఏర్పాట్లు..
ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం ప్రచారం ముగియడంతో ఆయా పల్లెలన్నీ సైలెంట్‌గా మారాయి. మరోవైపు ప్రలోభాలకు తెరలేచింది. ఓటర్లకు మందు, విందులు ఏర్పాటు చేసే పనిలో అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పోలింగ్‌కు కొన్నిగంటల మాత్రమే ఉండడంతో పోల్ మేనేజ్మెంట్పై ప్రత్యేక దృష్టి సారించారు. పలుచోట్ల ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయగా మరికొందరు మద్యం, కూల్ డ్రింక్ బాటిళ్లను ఇంటింటికీ సరఫరా చేస్తున్నారు.
Panchayat Elections | వలస ఓటర్లపై ప్రత్యేక దృష్టి..
దూర ప్రాంతాల్లో ఉన్న వలస ఓటర్లను (voters) ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉద్యోగరీత్యా ఇతర పనులు చేసుకునేందుకు రాజధానికి ఇతర ప్రాంతాలకు వెళ్లిన ఓటర్లను తరలిరావాలని తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఓటర్లకు మచ్చ చేసుకునేందుకు వారి రవాణా చార్జీలను సైతం చెల్లిస్తున్నారు. మరికొందరు రవాణా చార్జీలతో పాటు ఓటుకు నోటు అందిస్తూ వలస ఓటర్ల ఓట్లను దండుకునేందుకు వయా ప్రయాస పడుతున్నారు.
Panchayat Elections | మాంసం, కూల్‌డ్రింక్స్..
అలాగే గ్రామాల్లో ప్రతి ఇంటికీ తిరుగుతూ తమకు పూర్తి మద్దతును అందించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. తమకు అనుకూలంగా ఉన్న ఓటర్లకు డబ్బులతో పాటు మద్యం మాంసం, కూల్ డ్రింక్‌లను అందజేస్తున్నారు. యువతకు విందులు వినోదాల్లో ముంచేత్తుతున్నారు. తెల్లారితే పోలింగ్ ఉండటంతో అభ్యర్థులు వారి అనుచరులు ఓటర్లను పూర్తిస్థాయిలో ప్రసన్నం చేసుకునేందుకు పాట్లు పడుతున్నారు. ఒక రోజులోనే తమ భవితవ్యం బయట పడుతుందని నేడు ఖర్చుకు వెనకాడితే ఐదేళ్లపాటు వెనకే ఉండాల్సి వస్తుందని భావిస్తున్న అభ్యర్థులు డబ్బుఖర్చుకు అస్సలు ఆలోచించట్లేదు.