Homeజిల్లాలునిజామాబాద్​TIGER | సిరికొండలో పులి సంచారం..

TIGER | సిరికొండలో పులి సంచారం..

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: TIGER : నిజామాబాద్​ జిల్లా(Nizamabad district) సిరికొండ మండలం(Sirikonda mandal)లో పులి సంచారం కలకలం రేపుతోంది. సమీప అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ మేరకు స్థానిక ప్రజలను అప్రమత్తం చేశారు.

TIGER : ఎక్కడి నుంచి వచ్చిందంటే..

సిరికొండ అటవీ(forest) ప్రాంతలో సంచరిస్తున్న పులిని (512 GA) గా భావిస్తున్నారు. ఇది మంచిర్యాల (Mancherial), కుమురం భీం ఆసిఫాబాద్ (Kumuram Bheem Asifabad) జిల్లాల్లో సంచరిస్తున్న సమయంలో దీనిని గుర్తించారు. ఇది మగ పులిగా పేర్కొంటున్నారు. ఈ పులి మొదట మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట్ రేంజ్‌ అడవు (Lakshettipet Range forests) ల్లో కనిపించినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత ఇది సంచరిస్తూ కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి అడవు (Tiryani forests) ల్లోకి వెళ్లింది.

అయితే, ఈ పులి కరీంనగర్​ (Karimnagar), వేములవాడ (Vemulawada) అడవుల మీదుగా సంచరిస్తూ సిరికొండ ప్రాంతానికి చేరుకున్నట్లు అటవీశాఖ అభిప్రాయపడుతున్నారు. అంటే వందల కిలోమీటర్ల మేర ప్రయాణించి, ఈ ప్రాంతానికి చేరుకున్నట్లు తెలుస్తోంది.

tiger
tiger

TIGER : ఇదే మొదటిసారి..!

నిజామాబాద్​ జిల్లాలో పులి సంచారం గతంలో ఎన్నడూ గుర్తించలేదు. ఇదే మొదటిసారిగా పేర్కొంటున్నారు. జిల్లాలో చిరుత పులులు చాలానే ఉన్నాయి. తాజాగా పులి వచ్చినట్లు గుర్తించారు

TIGER : హెచ్చరికలు జారీ చేసిన అధికారులు

సిరికొండ అటవీ ప్రాంతంలో పులి సంచారంపై స్థానిక ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. రాత్రుల్లో బయట సంచరించొద్దని హెచ్చరికలు జారీ చేశారు. రైతులు ఒంటరిగా కాకుండా, గుంపుగా ఉండాలని సూచిస్తున్నారు. అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న పొలాల్లో పనిచేసేవారు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. కొండ ప్రాంతాలవారు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంటున్నారు.