Homeజిల్లాలునిజామాబాద్​Mopal | భారీగా అల్ప్రాజోలం పట్టివేత.. ఇద్దరి అరెస్ట్​

Mopal | భారీగా అల్ప్రాజోలం పట్టివేత.. ఇద్దరి అరెస్ట్​

మోపాల్​లోని తాడెం వద్ద నార్కోటిక్​ పోలీసులు దాడులు చేసి మత్తు పదార్థాలు పట్టుకున్నారు. 500 గ్రాముల అల్ఫ్రాజోలంను స్వాధీనం చేసుకుని ఇరువురిని అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ: Mopal | మోపాల్‌ మండల పరిధిలో సోమవారం నార్కోటిక్‌ అధికారులు (Narcotics Police) దాడులు జరిపారు. నార్కోటిక్‌ ఇన్‌స్పెక్టర్‌ పూర్ణేశ్వర్‌ ప్రత్యేక టీం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన దాడుల్లో భారీగా అల్ప్రాజోలం (Alfrazolam) పట్టుకున్నారు.

వారు తెలిపిన వివరాల ప్రకారం.. వినాయక్​నగర్​కు (Vinayak Nagar) చెందిన సాగర్​ గౌడ్​, ప్రవీణ్​ గౌడ్​లు మోపాల్​ మండలానికి వెళ్తుండగా.. పక్కా సమాచారం మేరకు మోపాల్​ మండలంలోని తాడెం వద్ద నార్కోటిక్​ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 5 లక్షల విలువైన 500 గ్రాముల అల్ఫ్రాజోలంను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిద్దరిపై కేసు నమోదు చేసి విచారణ నిమిత్తం మోపాల్​ ఎస్సైకి అప్పజెప్పినట్లు వివరించారు.

Mopal | యథేచ్ఛగా మత్తు పదార్థాల సరఫరా

జిల్లా పరిధిలో మత్తు పదార్థాల సరఫరా యథేచ్ఛగా సాగుతోంది. నిజామాబాద్​ మండల పరిధిలో ఇదివరకు నార్కోటిక్​ పోలీసులు దాడులు జరిపి ఇరువురిని అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్​ మండల పరిధిలోని గుండారంలో (Gundaram) ఓ కల్లుడిపోపై దాడిచేసి 600 గ్రాముల అల్ప్రాజోలంను స్వాధీనం చేసుకున్నారు. మళ్లీ సోమవారం సైతం మోపాల్​ మండల పరిధిలో దాడులు జరిగాయి. దీనిని బట్టి చేస్తే మత్తుపదార్థాల సరఫరా అనేది నిజామాబాద్​ సిటీ, మండల పరిధుల్లో యథేచ్ఛగా సాగుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.