Homeబిజినెస్​Stock Market | లార్జ్‌ క్యాప్‌లో ర్యాలీ.. లాభాల్లో ప్రధాన సూచీలు

Stock Market | లార్జ్‌ క్యాప్‌లో ర్యాలీ.. లాభాల్లో ప్రధాన సూచీలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market | జియో పొలిటికల్‌ టెన్షన్స్‌(Geo political tensions) తగ్గుముఖం పట్టడంతో స్టాక్‌ మార్కెట్లో ర్యాలీ కొనసాగుతోంది. బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు వరుసగా మూడో రోజూ లాభాల బాటలో పయనిస్తున్నాయి. ఈ క్రమంలో ఇంట్రాడేలో సెన్సెక్స్‌, నిఫ్టీలు తొమ్మిది నెలల గరిష్టాన్ని తాకాయి. గురువారం ఉదయం 127 పాయింట్ల స్వల్ప లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్‌(Sensex).. అక్కడి నుంచి మరో 498 పాయింట్లు పెరిగింది. 24 పాయింట్ల లాభంతో ప్రారంభమైన నిఫ్టీ ఇంట్రాడేలో మరో 169 పాయిట్లు పైకి ఎగబాకింది. అయితే ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో ఇంట్రాడే గరిష్టాలనుంచి సెన్సెక్స్‌ 564 పాయింట్లు, నిఫ్టీ(Nifty) 178 పాయింట్లు పడిపోయాయి. ఉదయం 11.15 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 315 పాయింట్ల లాభంతో 83,070 వద్ద, నిఫ్టీ 91 పాయింట్ల లాభంతో 25,336 వద్ద కొనసాగుతున్నాయి. ఇండెక్స్‌ హెవీవెయిట్‌ స్టాక్స్‌ అయిన రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎయిర్‌టెల్‌(Airtel) సూచీలను ముందుకు తీసుకువెళ్తున్నాయి. ఇరాన్‌తో అణు ఒప్పందం విషయంలో వచ్చేవారంలో చర్చలు జరగనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. గురువారం ఆసియా మార్కెట్లు స్థిరంగా పైకి పెరుగుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ బలపడుతుండడం మన మార్కెట్లకు సానుకూలాంశం.

Stock Market | మిశ్రమంగా స్పందిస్తున్న సెక్టార్లు..

బీఎస్‌ఈలో ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌(Oil and gas) ఇండెక్స్‌ ఒక శాతానికిపైగా లాభంతో ఉంది. ఎనర్జీ ఇండెక్స్‌ 0.82 శాతం, మెటల్‌ 0.51 శాతం, కమోడిటీ 0.35 శాతం, ఇన్‌ఫ్రా 0.34 శాతం లాభాలతో ఉన్నాయి. రియాలిటీ ఇండెక్స్‌ 1.33 శాతం, పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 0.65 శాతం, ఐటీ ఇండెక్స్‌ 0.41 శాతం, ఆటో(Auto) 0.92 శాతం, హెల్త్‌కేర్‌ 0.10 శాతం నష్టాలతో సాగుతున్నాయి. లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.35 శాతం లాభంతో ఉండగా.. మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.08 శాతం, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.06 శాతం నష్టంతో కదలాడుతున్నాయి.

Top gainers: బీఎస్‌ఈలో 21 కంపెనీలు లాభాలతో, 9 కంపెనీలు నష్టాలతో ఉన్నాయి. బజాజ్‌ ఫైనాన్స్‌(Bajaj finance) 1.55 శాతం, రిలయన్స్‌ 1.27 శాతం, ఎటర్నల్‌ 1.18 శాతం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 1.09 శాతం, అదాని పోర్ట్స్‌ 0.97 శాతం లాభాలతో ఉన్నాయి.

Top losers: ఎస్‌బీఐ(SBI) 1.04 శాతం, సన్‌ఫార్మా 0.684 శాతం, కొటక్‌ బ్యాంక్‌ 0.72 శాతం, టెక్‌ మహీంద్రా 0.62 శాతం, ట్రెంట్‌ 0.61 శాతం నష్టాలతో ఉన్నాయి.