Homeజిల్లాలుహైదరాబాద్ORR | ఓఆర్​ఆర్​ సర్వీస్ ​రోడ్డుపైకి దూసుకొచ్చిన పెద్ద బండరాళ్లు.. తప్పిన ప్రమాదం

ORR | ఓఆర్​ఆర్​ సర్వీస్ ​రోడ్డుపైకి దూసుకొచ్చిన పెద్ద బండరాళ్లు.. తప్పిన ప్రమాదం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ORR | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో నాలుగైదు రోజులుగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల (Heavy Rains)తో లోతట్టు ప్రాంతాలు జలమయం అయి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై నీరు చేరి చెరువులను తలపిస్తుండటంతో వాహనదారులు ట్రాఫిక్​లో చిక్కుకొని నరకయాతన అనుభవిస్తున్నారు. వరద ఉధృతికి పలు ప్రాంతాల్లో వాహనదారులు కొట్టుకుపోతున్నారు. అయితే తాజాగా ఔటర్​ రింగ్​ రోడ్డు (ORR) సర్వీస్​ రోడ్డు (Service Road)లోకి పెద్ద బండరాళ్లు దూసుకొచ్చాయి.

నార్సింగి- అప్పా (Narsing -Appa) రోడ్డులో బండరాళ్లు విరిగి పడ్డాయి. వర్షాలతో బండరాళ్ల కింద మట్టి జారిపోవడంతో అవి రోడ్డుపైకి దూసుకు వచ్చాయి. రెండు పెద్ద బండరాళ్లు సర్వీస్​ రోడ్డుకుపైకి వచ్చాయి. ఆ సమయంలో అక్కడ వాహనాలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రాళ్లు రోడ్డుపై పడటంతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్​ జామ్​ అయింది. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు. ట్రాఫిక్​ను క్లియర్​ చేస్తున్నారు. ఆ బండరాళ్లను రోడ్డుపై నుంచి తొలగించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ మార్గంలో ట్రాఫిక్​ జామ్​ కావడంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్​ పోలీసులు వాహనదారులకు సూచించారు.

మరోవైపు నిత్యం వర్షాలు కురుస్తుండటంతో బేగంబజార్‌లో ఓ పురాతన భవనం కుప్పకూలింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. హిమాయత్ సాగర్​ (Himayat Sagar) గేట్లు ఎత్తడంతో మూసీ నది ఉధృతంగా పారుతోంది. దీంతో నది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.