CP-Sai-Chaitanya
CP Sai Chaitanya | భారీగా అల్ప్రాజోలం పట్టివేత.. ఐదుగురి అరెస్ట్

అక్షరటుడే నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | జిల్లా పోలీసులు భారీ మొత్తంలో అల్ప్రాజోలం పట్టుకొని, ఐదుగురు నిందితులను అరెస్ట్​ చేశారు. ఈ మేరకు సీపీ శుక్రవారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. బోధన్ మండలం సాలూర గ్రామం హనుమాన్ టెంపుల్ దగ్గర రూ.25 లక్షల విలువైన 2.5 కేజీల అల్ప్రాజోలం, స్కోడా కారు, 8 సెల్‌ఫోన్లు, రూ.2.5 లక్షల నగదు పోలీసులు గురువారం అర్ధరాత్రి స్వాధీనం చేసుకున్నారు.

అల్ప్రాజోలం తరలిస్తున్న మహారాష్ట్రలోని నంద్ గోవాన్ సతారాకు చెందిన అమర్ సింగ్ దేశముఖ్, పూణేలోని చించ్వాడ్ స్టేషన్​కు చెందిన బాబు రావు బస్వరాజ్ కాడేరి అలియాస్​ ప్రసాద్ కాడేరి, పరమేశ్వర్ విజయ్ బర్దాడే, ఉమర్గా తాలూకా గుంజేటి ప్రాంతానికి చెందిన షబ్బీర్ అలీ పాషామియ, నిజామాబాద్ సాయి నగర్​కు చెందిన మల్లెపూల లక్ష్మణ్ గౌడ్​ను అరెస్టు చేశారు. మరో నిందితుడు మహారాష్ట్రకు చెందిన విశ్వనాథ్ శిపంకర్ పరారీలో ఉన్నట్లు సీపీ తెలిపారు.

గురువారం రాత్రి నిందితులు మల్లెపూల లక్ష్మణ్ గౌడ్​కు అల్ప్రాజోలం విక్రయించడానికి వచ్చారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి వారిని పట్టుకున్నట్లు సీపీ తెలిపారు.