HomeUncategorizedVice President Dhankhar | భాష మ‌న‌ల్ని విభ‌జించ‌లేదు.. ఏకం చేస్తుంద‌న్న ఉప రాష్ట్ర‌ప‌తి ధ‌న్‌ఖ‌డ్‌

Vice President Dhankhar | భాష మ‌న‌ల్ని విభ‌జించ‌లేదు.. ఏకం చేస్తుంద‌న్న ఉప రాష్ట్ర‌ప‌తి ధ‌న్‌ఖ‌డ్‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Vice President Dhankhar | ప్ర‌పంచంలోనే అత్యంత సంప‌న్న భాష‌లు మన‌కు మాత్ర‌మే సొంత‌మ‌ని ఉప రాష్ట్ర‌పతి జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్ అన్నారు. భాష మ‌న‌ల్ని విభ‌జించ‌లేద‌ని, ఏకం చేస్తుంద‌ని తెలిపారు.

నూత‌న విద్యా విధానంలో మూడో భాష‌గా హిందీ(Third Language Hindi)ని త‌ప్ప‌నిస‌రి చేసిన నేప‌థ్యంలో దేశంలో భాషా విభేదాలు చెల‌రేగాయి. సోమ‌వారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభ‌మ‌వుతున్న నేప‌థ్యంలో ధ‌న్‌ఖ‌డ్(Vice President Dhankhad) చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. దేశవ్యాప్తంగా భాషలపై కొనసాగుతున్న వివాదం మధ్య ఐక్యంగా ఉండాల్సిన అవ‌స‌రాన్ని ఆయ‌న నొక్కి చొప్పారు.

Vice President Dhankhar | ఆ విష‌యంలో అత్యంత సంప‌న్న దేశం..

భాషల విషయంలో భారతదేశం అత్యంత సంప‌న్న‌మైన దేశమ‌ని ఉప రాష్ట్ర‌ప‌తి అన్నారు. “మనకు సంపన్న భాషలు ఉన్నాయి. సంస్కృతం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ, మరాఠీ వంటి శాస్త్రీయ భాషలు ఉన్నాయి. భాషల విషయంలో మనం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ధనవంతులం” అని ఆయ‌న పేర్కొన్నారు. కాబ‌ట్టి భాష మనల్ని ఏకం చేయాలి త‌ప్పితే మ‌న‌ల్ని ఎలా విభజించగలదని ప్ర‌శ్నించారు.

Vice President Dhankhar | మ‌న‌వి ప్ర‌పంప ప్ర‌సిద్ధ భాష‌లు

భాష కారణంగా విభజించడానికి లేదా విభజన వ్యూహాలలో పాల్గొనడానికి ప్రయత్నించేవారు ముందు మన సంస్కృతిలోకి రావాల‌ని ధ‌న్‌ఖ‌డ్ పేర్కొన్నారు. మన భాషలు మన దేశానికే పరిమితం కాదు, అవి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయన్న విష‌యాన్ని గుర్తుంచుకోవాల‌న్నారు.

నూత‌న విద్యావిధానానికి శ్రీ‌కారం చుట్టిన కేంద్ర ప్ర‌భుత్వం(Central Government) త్రిభాషా విధానాన్ని తీసుకొచ్చింది. ఇందులో త‌ప్ప‌నిస‌రిగా హిందీని చేర్చాల‌ని సూచించింది. అయితే, త‌మ‌పై బ‌ల‌వంతంగా హిందీని రుద్దుతున్నార‌న్న భావ‌న ద‌క్షిణాది రాష్ట్రాల్లో వ్యాపించింది. మహారాష్ట్ర(Maharashtra), తమిళనాడు(Tamil Nadu), కర్ణాటక(Karnataka)తో సహా కొన్ని రాష్ట్రాల్లో భాషా వివాదం చెల‌రేగింది. ఈ నేప‌థ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో(Government Schools) ఒకటో తరగతి నుంచి హిందీని మూడో భాషగా ప్రవేశపెట్టాలనే నిర్ణయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవ‌ల వెనక్కి తీసుకుంది.