అక్షరటుడే, వెబ్డెస్క్ : Uttarakhand | ఉత్తరాఖండ్(Uttarakhand)లో కొండచరియలు విరిగిపడ్డాయి landsllides. పితోరాగఢ్ జిల్లా సమీపంలో మానస సరోవర్ (manasa sarovar) యాత్ర మార్గంలో మంగళవారం కొండ చరియలు విరిగిపడ్డాయి. రోడ్డుపై కొండచరియలు పడడంతో వందలాది మంది యాత్రికులు Pilgrims చిక్కుకుపోయారు. రోడ్డుపై మట్టి తొలగించి, రాకపోకలు సాగేలా అధికారులు చర్యలు చేపట్టారు. రోడ్డుపై పడ్డ శిథిలాలను బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(BRO) తొలగిస్తోంది. కాగా ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే రోడ్డు మూసుకుపోవడంతో యాత్ర తాత్కాలికంగా నిలిచిపోయింది. యాత్రికులు ఎక్కడి వారు అక్కడే సంయమనంతో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వారికి ఆహారం, నీరు అందిస్తున్నారు.
