Homeతాజావార్తలుLand Scam | వామ్మో ఇంత పెద్ద భూ కుంభకోణమా.. అసైన్డ్ భూమిలో వెంచర్.. అనుమతులు...

Land Scam | వామ్మో ఇంత పెద్ద భూ కుంభకోణమా.. అసైన్డ్ భూమిలో వెంచర్.. అనుమతులు సైతం జారీ..!

Land Scam | అది అసైన్డ్​ భూమి.. దానిపై పెద్దల కన్ను పడింది.. వీరికి ఓ ఐఏఎస్​ అధికారి తోడయ్యాడు. ఇంకేం, భారీ భూ కుంభకోణానికి పాల్పడ్డారు. రాత్రికి రాత్రి పట్టాభూమిగా మార్చి, వెంచర్​ వేశారు.

- Advertisement -

అక్షర టుడే, వెబ్​డెస్క్: Land Scam | రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు సర్కారు భూముల రక్షణకు చర్యలు చేపడుతోంది. ప్రభుత్వ, అసైన్డ్, శిఖం, అటవీ భూముల లెక్కలు తేల్చే పనిలో పడింది.

ఒకవేళ కబ్జాలకు పాల్పడితే సత్వరమే చర్యలు తీసుకుని సంబంధింత భూములను స్వాధీనం చేసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.

అయితే, నిజామాబాద్ జిల్లాలో అసైన్డ్ భూమిలో దర్జాగా వెంచర్ వెలిసింది. నందిపేట మండల కేంద్రంలో అసైన్డ్ భూమిని ఆక్రమించిన కొందరు ఇందులో ప్లాట్లను ఏర్పాటు చేసి వెంచర్ కూడా పూర్తి చేశారు. రెండెకరాలకు అనుమతులు తీసుకుని దాదాపు పది ఎకరాల్లో వెంచర్ పనులు జరిపినట్లు సమాచారం.

Land Scam | ఆ ఐఏఎస్ అందండలతో..

నందిపేట్ మండలంలో సర్వే నంబరులోని స్థలం 630 పూర్తిగా ప్రభుత్వ భూమి. అసలు సేత్వార్ మొదలు రికార్డులన్నీ కూడా సర్కారు భూమి అన్నది అక్షర సత్యం.

కానీ, గతంలో జిల్లాలో పని చేసి వెళ్లిన ఓ ఐఏఎస్ అధికారి సాయంతో కొందరు స్థానిక నేతలు రికార్డులు ట్యాంపరింగ్ చేసినట్లు సమాచారం.

అసైన్డ్ భూమిని పట్టాగా మార్చుకుని ఏకంగా డీటీసీపీ అనుమతులు కూడా తీసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఓ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఐఏఎస్ అన్నీ తానై చూసుకున్నాడు. దీంతో రాత్రికి రాత్రి అసైన్డ్ భూమి కాస్త పట్టా భూమిగా మారిపోయింది.

Land Scam | ఏం చేశారంటే..!

సర్వే నంబరు 630లో పెద్దమొత్తంలో అసైన్డ్ భూమి ఉంది. ఇందులో వందలాది మంది పేదలకు అసైన్డ్ పట్టాలు ఇచ్చారు. కాగా.. ఈ భూములను పట్టా భూములుగా మార్చుకునేందుకు శ్రీరాంసాగర్ ముంపునకు గురైన డీ ఫాం పట్టాలను సృష్టించారు.

వీటి ఆధారంగా సదరు కలెక్టర్ సాయంతో పట్టా భూమిగా రికార్డులు మారిపోయాయి. ఏకంగా కలెక్టర్ నుంచి ఆదేశాలు రావడంతో ఆర్డీవో మొదలు తహశీల్దార్ వరకు అంతా వ్యవహారాన్ని లోలోపలే చక్కదిద్దారు.

పట్టాగా మార్చడం నుంచి, నాలా అనుమతులు ఇవ్వడం, టీఎల్పీ కోసం ఎన్ఓసీ జారీ చేయడం అంతా చకచకా జరిగిపోయాయి. అయితే.. ఈ వెంచర్ కు చుట్టుపక్కల అన్న భూములన్నీ ఒకే సర్వే నంబరుకు చెందినవి కావడం, అవన్నీ నిషేధిత జాబితాలో ఉండటం గమనార్హం.

Must Read
Related News