అక్షరటుడే, వెబ్‌డెస్క్: Land Rover Car | బ్రిటిష్ లగ్జరీ కార్ల బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) భారతదేశం కోసం ప్రత్యేకంగా లిమిటెడ్ ఎడిషన్ మోడల్ ‘రేంజ్ రోవర్ ఎస్‌వీ మసారా’ కారును తీసుకువచ్చింది. రేంజ్ రోవర్ ఎస్వీ(SV) రణథంబోర్ ఎడిషన్ తర్వాత తీసుకువచ్చిన రెండో ఇండియా స్పెసిఫిక్ మోడల్ ఇది. ‘మసారా’ అనే పేరును సంస్కృతం నుంచి తీసుకున్నారు. ఇది సఫైర్‌ను సూచిస్తుంది. ఈ ఎడిషన్‌ను JLR స్పెషల్ వెహికల్ ఆపరేషన్స్ (SVO) డివిజన్ రూపొందించింది. ఎక్స్ షోరూం ధర రూ. 4.99 కోట్లు. కాగా 12 యూనిట్లు మాత్రమే తయారు చేశారు. ఇది చూడడానికి కొంత భిన్నంగా ఉంటుందని, భారతీయ సంస్కృతితో దాని లోతైన సంబంధాన్ని ప్రతిబింబిస్తుందని కంపెనీ పేర్కొంది. దీని ప్రత్యేకతలు తెలుసుకుందామా..
ఎక్స్‌టీరియర్ డిజైన్: హిమాలయన్ సఫైర్(Himalayan sapphire)ల నుంచి ప్రేరణ పొందిన ప్రత్యేకమైన సాటిన్ బ్లూ ఫినిష్, రూఫ్, మిర్రర్ క్యాప్స్‌కు కూడా విస్తరించింది.
వీల్స్: 23 ఇంచెస్ ఆబ్లివియన్ 1077 డైమండ్ టర్న్ అల్లాయ్ వీల్స్.
ఇంటీరియర్ ఫీచర్స్: లిబర్టీ బ్లూ, పెర్లినో లెదర్‌తో డ్యూయల్ టోన్ ఇంటీరియర్. ఫ్రంట్ సీట్లు డీప్ బ్లూ లెదర్‌తో, రేర్ సీట్లు లైట్ బీజ్ లెదర్‌తో ఉంటాయి.
SV సిగ్నేచర్ సూట్: రేర్ ప్యాసింజర్ల కోసం ఫుల్లీ రిక్లైనబుల్ సీట్లు, పవర్డ్ క్లబ్ టేబుల్, డిప్లాయబుల్ కప్‌హోల్డర్స్ ఉన్నాయి.
టెక్నాలజీ, సౌకర్యాలు: 13.1 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ప్రీమియం మెరిడియన్ సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్ ఉన్నాయి. వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, పవర్డ్ టెయిల్‌గేట్ వంటి ఫీచర్స్ కలిగి ఉంది.
సేఫ్టీ ఫీచర్స్..
మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), 360 డిగ్రీ కెమెరా, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్(ADAS).
ఇంజన్: 4.4 లీటర్ వీ8 ట్విన్ టర్బో పెట్రోల్ ఇంజన్ 606 నుంచి 615 bhp పవర్, 750 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
ట్రాన్స్‌మిషన్: ఇంజిన్ 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది., ఇది నాలుగు చక్రాలకు శక్తిని అందిస్తుంది.
పనితీరు: 0-100 kmph స్పీడ్‌ను 4.5 సెకన్లలో అందుకుంటుంది.